E-Paper
Advertisement

దేశంలోని 90 శాతం ట్రక్కులపై నాగాలాండ్ నెంబరే ఎందుకు రాసి ఉంటుంది? అసలు సీక్రెట్ ఇదే!

దేశంలోని 90 శాతం ట్రక్కులపై నాగాలాండ్ నెంబరే ఎందుకు రాసి ఉంటుంది? అసలు సీక్రెట్ ఇదే!
Advertisement

NL Number Plate Mystery: దేశంలో ఏ రహదారి చూసిన పెద్ద ఎత్తున నాగాలాండ్ రిజిస్ట్రేషన్ల (NL)తో ట్రక్కులు, కంటైనర్లు, ప్రైవేటు బస్సులు దర్శనమిస్తుంటాయి. ఫలితంగా సోషల్ మీడియాలో, సామాన్య ప్రజల్లో దేశంలోని 90 శాతం ట్రక్కులు నాగాలాండ్‌లోనే రిజిస్టర్ అవుతాయనే ప్రచారం బలంగా ఉంది. అదే సమయంలో అలా ఎందుకు జరుగుతుందో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాని వెనుక ఉన్న బలమైన కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

పన్ను భారం నుంచి తప్పించుకునేందుకే..

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వాణిజ్య వాహనాలపై రోడ్డు పన్ను (Road Tax) చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో కొత్తది రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ. లక్షల్లో ఖర్చవుతుంది. అయితే ఇందుకు భిన్నంగా నాగాలాండ్ ప్రభుత్వం వాహనాలపై అత్యంత తక్కువగా పన్నులను వసూలు చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ట్రక్ బిజినెస్ చేసేవారు, లారీల ఓనర్లు, ట్రావెల్స్ బస్సులు నడిపేవారు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ కు మెుగ్గు చూపుతున్నారు.

నాగాలాండ్‌ పన్ను మినహాయింపులు ఇవే..

Advertisement

నాగాలాండ్ రవాణా శాఖ – 2026 నిబంధనల ప్రకారం.. ఆ రాష్ట్రంలో సరుకు రవాణా వాహనాలకు వాటి బరువు ఆధారంగా అత్యంత స్వల్ప వార్షిక పన్నును నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో వాహనం ఖరీదులో శాతం లెక్కన భారీగా పన్ను వేస్తుంటే.. నాగాలాండ్‌లో మాత్రం 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల భారీ ట్రక్కుకు ఏడాదికి కేవలం రూ. 2,000 మాత్రవే వసూలు చేస్తున్నారు. 20 నుంచి 30 టన్నుల వాహనానికి రూ. 2,500, 30 టన్నుల పైబడిన అతిభారీ ట్రైలర్లకు కేవలం రూ. 3,000 మాత్రమే రోడ్డు పన్నుగా ఉంది.

నేషనల్ పర్మిట్ వెసులుబాటు

మోటారు వాహనాల చట్టం ప్రకారం ఒకసారి ‘నేషనల్ పర్మిట్’ (National Permit) పొందిన వాహనం.. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. దీనివల్ల ట్రక్కు యజమానులు నాగాలాండ్‌లో తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేయించి నేషనల్ పర్మిట్ తీసుకుని దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకుంటున్నారు. దీనికి తోడు నాగాలాండ్ ఆర్టీఓ (RTO) కార్యాలయాల్లో ఏజెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుండటం కూడా ట్రాన్స్‌పోర్టర్లకు కలిసొస్తోంది.

Advertisement

Also Read: ఉక్కు రంగంలో భారీ ఒప్పందం.. ఏపీఎల్ అపోలో చేతికి టాటా స్టీల్ కీలక విభాగాలు.. డీల్ విలువ ఎంతంటే?

మెుత్తం వాహనాల్లో 40% ట్రక్కులే..

తాజా గణాంకాల ప్రకారం.. నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన మొత్తం వాహనాల్లో దాదాపు 40 శాతం భారీ ట్రక్కులు, బస్సులే ఉండటం విశేషం. గతేడాది నవంబర్ నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ మధ్య కాలంలోనే అక్కడ 12,885 కొత్త ట్రక్కులు, బస్సులు రిజిస్టర్ అయ్యాయి. మరోవైపు ఈ పన్ను మినహాయింపులను ఆసరాగా చేసుకుని దొంగిలించిన ట్రక్కులకు అక్కడ నకిలీ పత్రాలు సృష్టిస్తున్నాయి. అటు తమ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన లక్షలాది ట్రక్కుల్లో ఎన్ని ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నాయనే దానిపై ప్రత్యేక డేటా లేదని నాగాలాండ్ ప్రభుత్వం చెబుతోంది.

Also Read: తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

Tags

Related News

ఏపీలో 3 కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం నుంచి నెల్లూరు వరకు ప్రయాణం ఇక మరింత ఈజీ!

రికార్డుల్లో కనిపించని ఎయిర్ ఇండియా విమానం.. 10 ఏళ్ల తర్వాత ఎక్కడ బయటపడిందో తెలుసా?

చలికాలంలో వెచ్చని వాతావరణం కావాలా?.. వింటర్ వెకేషన్‌కు ఈ 5 ప్రదేశాలు బెస్ట్

వందే భారత్‌లో క్యాష్ బ్యాగ్ మరిచిపోయిన ఫారినర్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!

Big Stories

Advertisement
×