Vivo Y18T : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో.. తాజాగా వై-సిరీస్ ఫోన్లలో భాగంగా వై18టీ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంఛ్ చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తో లాంఛ్ అయిన ఈ మెుబైల్ ను అందుబాటు ధరలోనే కొనే అవకాశం ఉందని వివో తెలిపింది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్న వివో.. కొన్నాళ్ల క్రితం తీసుకొచ్చిన వీ-సిరీస్ ఫోన్లకు మంచి డిమాండ్ కనిపించటంతో తాజాగా మరో మొబైల్ ను తీసుకొచ్చింది బడ్జెట్ లోనే రెండు కలర్ ఆప్షన్లలో వై18టీ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసింది. ఐపీ54 రేటెడ్ బిల్డ్ తో వచ్చేసిన ఈ ఫోన్ వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ ఉన్నాయి. ఇక యూనిసోక్ టీ612 ప్రాసెసర్, 4 GB RAM + 128 GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mah కాగా 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
Vivo Y18T Mobile –
వీవో Y18T స్పెసిఫికేషన్స్ –
ధర – ఈ స్మార్ట్ ఫోన్లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక 4 GGB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. RAMను 8 GB వరకు పెంచుకోనే అవకాశం ఉంది.
కలర్స్ – Vivo Y18T మెుబైల్ ను జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వివోతో పాటు ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ప్రాసెసర్ – ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ OS 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి ఈ ఫోన్ పని చేయనుంది.
డిస్ ప్లే – ఇందులో 6.56 అంగుళాల HD + LED డిస్ ప్లే ఉంది. 90 HZ రిఫ్రెష్ రేట్, 269 పీపీఐ డెన్సిటీ, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
కెమెరా – ఈ ఫోన్ వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 MP సెన్సార్ ఉంది.
కనెక్టివిటీ – బ్లూటూత్ V5.2, FM రేడియో, GPS, OTG, wifi, USB టైప్ – సీ పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ – కంపాస్, మోటార్ గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైతం అందించారు.
బ్యాటరీ – Vivo Y18Tలో 15W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న 5000mah బ్యాటరీ ఉంది. ఇక ఒక్క ఛార్జింగ్ తో 62 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 6.8 గంటల పబ్జీ ప్లేబ్యాక్ టైమ్ ను ఈ ఫోన్ అందించనుంది. ఈ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు, బరువు 185 గ్రాములు.
ఇక ఇంకెందుకు ఆలస్యం.. తక్కువ ధరతోనే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను కొనాలనుకునే వినియోగదారులు కచ్చితంగా ఈ మోడల్ మొబైల్స్ ను తప్పుకుండా ట్రై చేేసేయండి.
ALSO READ : టెక్ ప్రియులకు ఇక పండగే.. ఆహా అనిపించే యాపిల్ కొత్త గ్యాడ్జెట్స్ వచ్చేస్తున్నాయ్