E-Paper
Advertisement

ఉన్నట్టుండి Pixel 11 Series ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? లీకైన వివరాలు ఇవే!

ఉన్నట్టుండి Pixel 11 Series ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? లీకైన వివరాలు ఇవే!
Advertisement

Google Pixel 11 Series: గూగుల్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘పిక్సెల్ 11’ను ఆగస్టు 12న జరగబోయే ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ప్రెజెంటేషన్‌కు ముందే ఈ ఫోన్ల ధరలు, ఫీచర్ల గురించి ఆసక్తికరమైన లీకులు బయటకు వచ్చాయి. ఈసారి రాబోయే ఫోన్లు గత మోడళ్ల కంటే కాస్త ఖరీదైనవిగా మారనున్నట్లు సమాచారం.

పెరగనున్న Pixel 11 సిరీస్ ధరలు..

తాజా నివేదికల ప్రకారం.. Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL ఫోన్ల ధరలను గూగుల్ పెంచే ఆలోచనలో ఉంది. అయితే ఈసారి బేస్ వేరియంట్‌లో చిన్న మార్పు చేశారు. పాత ఫోన్లలాగా 128GB కాకుండా, Pixel 11 సిరీస్ ఫోన్లన్నీ నేరుగా 256GB స్టోరేజ్‌తోనే ప్రారంభం కానున్నాయి. బ్రిటన్ మార్కెట్‌లో Pro మోడల్ ధర దాదాపు రూ.1,37,807, Pro XL ధర రూ.1,63,350 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Also Read: వాట్సప్ యూజర్లకు ఊహించని సర్‌ప్రైజ్.. ఈ ఒక్క అప్‌డేట్‌తో సీన్ మొత్తం మారిపోయింది!

ధరలు పెరగడానికి కారణమేంటి?

ఈ సిరీస్ ధరలు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది.. ఫోన్ల తయారీకి వాడే విడిభాగాల (కాంపొనెంట్స్) ఖర్చులు బాగా పెరిగిపోవడం. రెండోది.. ఆరంభ వేరియంట్‌లోనే 256GB స్టోరేజ్ ఇవ్వడం. స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడం వల్ల ఫోన్ల తయారీ వ్యయం పెరిగిందని, అందుకే ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీ ప్రతినిధుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ధరలపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

బ్యాటరీ కెపాసిటీ వివరాలు..

Advertisement

ధరలతో పాటు బ్యాటరీకి సంబంధించిన వివరాలు కూడా లీక్ అయ్యాయి. Pixel 11లో 4985mah, Pixel 11 Proలో 4850mah, Pro XL మోడల్‌లో 5115mah బ్యాటరీ ఉండవచ్చు. గతంలో వచ్చిన Pixel 10 సిరీస్‌తో పోలిస్తే.. ఇవి పరిమాణంలో కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అయితే గూగుల్ కొత్తగా తీసుకొస్తున్న టెన్సర్ ప్రాసెసర్ వేగంతో పాటు మంచి పవర్ ఎఫిషియెన్సీ ఇస్తుంది కాబట్టి.. బ్యాటరీ టైమ్‌లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు.

ఆగస్టు 12న Made By Google ఈవెంట్..

ఆగస్టు 12న జరిగే ఈవెంట్‌లో కంపెనీ ఈ 3 స్మార్ట్‌ఫోన్లతో పాటు Pixel Watch 5, మరికొన్ని కొత్త డివైజ్‌లను, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీక్స్ మాత్రమే కాబట్టి.. గూగుల్ అధికారికంగా వెళ్లడించే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!

Related News

సూపర్ పిక్చర్ క్లారిటీ, ప్రీమియం లుక్! రూ.999 కే నోయిస్ విజన్ 2

అమ్మాయిల కోసం స్టైలిష్ & సేఫ్ స్మార్ట్‌వాచ్ ..ధర కూడా చాలా తక్కువ

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫ్రిజ్ కావాలా? మార్కెట్‌లో రచ్చ లేపుతున్న మోడల్ ఇదే

వాట్సప్ యూజర్లకు ఊహించని సర్‌ప్రైజ్.. ఈ ఒక్క అప్‌డేట్‌తో సీన్ మొత్తం మారిపోయింది!

ఈ ఒక్క ఫీచర్ చాలు బ్రో.. Honor Band 11ను కళ్లు మూసుకొని కొనేయొచ్చు!

వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు..బెస్ట్ సౌండ్ ఇచ్చే టాప్ 5 మోడల్స్!

చిన్న రూమ్‌కి పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీ.. ఆఫర్‌లోనే వచ్చేస్తోంది బాస్

Big Stories

Advertisement
×