Google Call filtering update: ప్రస్తుతం అనేక మందికి ప్రతి రోజు కూడా అనేక రకాల స్పామ్ కాల్స్ వస్తుంటాయి. కేంద్రం వీటి కట్టడి కోసం పలు రకాల చర్యలకు సిద్ధమైనప్పటికీ ఇవి మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే స్పామ్ కాల్స్ కట్టడి కోసం గూగుల్ తన ఫోన్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ కాల్‌ల రకాన్ని బట్టి వర్గీకరించడం ద్వారా వినియోగదారులకు కాల్ నిర్వహణను మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలో వినియోగదారుల స్పామ్ కాల్‌లను ఫిల్టర్ చేయడం ద్వారా తెలియని నంబర్‌లను కట్టడిచేయడంతోపాటు, వారి కాల్ లాగ్‌లను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
గూగుల్ ఫోన్ యాప్ మీ కాల్‌లను ఒకే జాబితాలో కాకుండా ప్రత్యేక వర్గాలలో ప్రదర్శిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు స్పామ్ కాని కాల్స్ లను త్వరగా గుర్తించుకోవచ్చు. తద్వారా యాప్ వినియోగదారులు స్పామ్ కాల్స్ ఎంపికలను పరిమితం చేసుకోవచ్చు. దీంతోపాటు అలాంటి నంబర్ల నంచి ఇన్‌కమింగ్ రాకుండా ఫిల్టర్ చేసుకోవచ్చు.
ఈ కాల్ ఫిల్టరింగ్ అప్‌డేట్‌ను మొదటగా గత నెలలో ఫోన్ యాప్ 159.0.718038457 పబ్లిక్ బీటా-పిక్సెల్2024 అప్‌డేట్‌లో ప్రవేశపెట్టారు. మొదట్లో ఈ ఫీచర్‌ను బీటా టెస్టర్లు మాత్రమే యాక్సెస్ చేయగలిగారు. తాజా నివేదికల ప్రకారం, గూగుల్ ఇప్పుడు దీన్ని అన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్ సర్వర్ సైడ్ రోల్ అవుట్ లాగా కనిపిస్తోంది. అంటే ప్రస్తుతం అందరూ దీనిని ఒకే సమయంలో ఉపయోగించలేరు. కొంతమంది వినియోగదారులు త్వరగా, మరికొంత మంది ఆలస్యంగా వినియోగిస్తారు.
Read Also: Vivo T4x 5G: బడ్జెట్ ధరల్లో బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..
మీ పరికరంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి ముందుగా మీరు Google Play Store ద్వారా మీ Google Phone యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా ఈ ఫీచర్‌ను చూడకపోతే, సర్వర్ సైడ్ రోల్అవుట్ లో అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండండి.