ఏనుగు ఈ విశ్వంలో అత్యం శక్తివంతమైన జంతువు. బలం మాత్రమే కాదు, చాలా తెలివైన జంతువు కూడా. కాస్త ట్రైనింగ్ ఇస్తే అన్ని పనులను చక్కగా చేసి పెడుతుంది. సాధారణంగా మనం సర్కస్ లో ఏనుగులు చేసే విన్యాసాలు చూసి ముసిరిపోతాం. భలే గా ఎంటర్ టైన్ చేస్తుందిగా అని ఆశ్చర్యపోతాం. సర్కస్ లో మావటి ఎలా చెప్తే అలా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. సర్కస్ లోనే కాదు, బయట కూడా ఏనుగులు చక్కగా పనులు చేస్తాయి. కావాలంటే మీరు ఈ వీడియో చూడండి..త
మసాలా నూరి, గరిటె తిప్పి..
ఈ వీడియోలో ఏనుగు చక్కగా మోకాళ్ల మీద పడుకుని వంట చేస్తుంది. యజమాని చెప్పినట్లుగా తొండంతో గరిటె పట్టుకుని పొయ్యి మీద ఉన్న కడాయి లోని వంటకాలను కలియబెడుతుంది. ప్రొఫెషనల్ చెఫ్ మాదిరిగానే గరిటెను కడాయికి కొడుతుంది వావ్ అనిపిస్తుంది. కడాయిలోని పదార్థాలు చక్కగా మగ్గిన తర్వాత వంట పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఏనుగు ముందు రోలు ఉంచి అందులో మసాలా దినుసులు వేసి, ఏనుగు తొండానికి రోకలి అందిస్తుంది యజమాని. ఈ చిన్న ఏనుగు తన తొండంతో మసాలా దినుసులను మెత్తగా దంచుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో, నెటిజన్ల ఫన్నీ రియాక్షన్
ఈ ఫన్నీ వీడియోను @von0801736 అనే టిక్ టాక్ యూజర్ షేర్ చేశాడు. ప్రస్తుతం చెఫ్ గజరాజుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏనుగు పడుకుని తన యజమాని చెప్పినట్లు వంట చేస్తూ అందమైన హావభావాలను ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మగ ఏనుగు నిజమైన ప్రొఫెషన్ గా వ్యవహరిస్తూ అందరినీ అలరించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఏనుగు తెలివితేటను ప్రశంసిస్తున్నారు. ఈ ఏనుగు త్వరలోనే మంచి హోటల్ లో చెఫ్ గా మారే అవకాశం ఉందని కామెంట్స్ పెడుతుంటే, మరికొంత మంది ఇక ఆ ఏనుగు యజమాని చక్కటి రెస్టారెంట్ పెట్టుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఏనుగు చాలా చక్కగా ట్రైనింగ్ అయ్యింది. మరికొద్ది రోజుల్లోనే ప్రొఫెషన్ చెఫ్ గా మారే అవకాశం ఉందని ఇంకొంత మంది రాసుకొస్తున్నారు. ఇక ఆ ఏనుగు మాట్లాడ్డం కూడా నేర్చుకుంటే ఓ పని అయిపోతుందని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: ఈ పిల్లాడివి ‘ఊసరవెల్లి’ కళ్లు.. రంగులు ఎలా మారుతున్నాయో చూడండి!
ఈ ఏనుగుకు మరికాస్త శిక్షణ ఇస్తే అన్ని ఇంటి పనులను కూడా చక్కగా పని చేసి పెడుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బట్టలు ఉతకడం, ఇంటి పరిసరాలు శుభ్రం చేయడం సహా ఇతర పనులను కూడా చేసి పెడుతుందంటున్నారు. మొత్తంగా ఈ చిన్న ఏనుగు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది.
Read Also: మొసళ్లతో నిండిన నదిని దాటబోయిన 8 నక్కలు.. చివరికి ఎన్ని మిగిలాయంటే?