E-Paper
Advertisement

చంద్రబాబుకు దాసోహం.. నీటి హక్కులు తాకట్టు.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

చంద్రబాబుకు దాసోహం.. నీటి హక్కులు తాకట్టు.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!
Advertisement

Harish Rao: పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో సాగర్ కుడి వైపున ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు చేపడుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. దీనికోసం ఈ ఏడాది ఆగస్టు 4న జీవో ఇచ్చినా, అంతకుముందే ఏడాదిగా సర్వే, మొబిలైజేషన్ పనులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. మౌనం ఎందుకని నిలదీశారు. తాగునీటి పేరుతో రోజుకు 2 టీఎంసీల చొప్పున రెండు నెలల్లో 120 టీఎంసీల నీటిని తరలించే కుట్ర జరుగుతోందన్న హరీశ్.. ఇదే జరిగితే సాగర్ ఎండిపోయి నల్గొండకు నీళ్లు అందవన్నారు. అదే జరిగితే హైదరాబాద్ ప్రజలు వలస పోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

పనులపై అధికారులను తిట్టానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం.. ప్రభుత్వ తప్పిదాన్ని అంగీకరించి చెంపలేసుకోవడమేనని ఎద్దేవా చేశారు. సాగర్ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోతోందని ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకే అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ, ఇప్పుడు సాగర్ జలాల తరలింపు విషయంలోనూ బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం నిద్రలేచి లేఖలు రాసిందని విమర్శించారు.

Advertisement

కుర్చీల కోసం చంద్రబాబుకు దాసోహమై రాష్ట్ర నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు మూడేళ్లుగా బలమైన వాదనలు వినిపించలేకపోయారని విమర్శించారు. కనీసం 34 శాతం తాత్కాలిక వాటాను కూడా వాడుకోలేక 2024-25లో 28%, 2025-26లో 25% మాత్రమే వినియోగించుకున్నారని పేర్కొన్నారు. అటు కృష్ణా జలాల విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్లక్ష్యం పాలమూరు ప్రాజెక్టులకు బీఆర్ఎస్ రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే, కాంగ్రెస్ వచ్చి ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదన్నారు.

Also Read: అజిత్ ధోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. అసలేం జరిగింది? ఎవరీ గురుపత్వంత్ సింగ్ పన్నూ?

Advertisement

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను బీఆర్ఎస్ 11.5 కి.మీ. తవ్వితే కాంగ్రెస్ మూడేళ్లలో ఒక్క కిలోమీటరు కూడా తవ్వలేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రమాదంలో చనిపోయిన 8 మంది మృతదేహాలను కూడా బయటకు తీయలేకపోయిందని విమర్శించారు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తి వద్ద నీళ్లున్నా మోటార్లు నడపకుండా రాష్ట్రంలో కరువు సృష్టించారని ఆరోపించారు. సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, పాలమూరు, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని గుర్తుచేశారు.అసెంబ్లీలో చెప్పినట్లు మూడేళ్లలో 18 లక్షల ఎకరాలకు కాదు కదా, కనీసం 18 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

Tags

Related News

వాడు పోతే వీడు అంటూ.. ఛత్రపతి డైలాగ్‌తో హరీష్ రావుపై రెచ్చిపోయిన సీఎం రేవంత్!

‘మేడిగడ్డను కాంగ్రెసోళ్లే పేల్చేశారు.. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని రేవంత్ కోరిక’.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు!

సిద్దిపేట జిల్లాలో.. రూ. 544.11 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం!

డేంజర్ బెల్స్.. హైదరాబాద్‌లో చికెన్ తింటున్నారా..?

బిగ్ బ్రేకింగ్.. ఇంటర్ మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల!

తెలంగాణ సర్కార్ డబుల్ ధమాకా.. నవంబర్ 26న ఖాతాలోకి డబ్బులు!

ఎన్నికల వరకే రాజకీయం.. 3 జోన్లుగా తెలంగాణ విభజన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×