Hidden smartphone keyboard: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం ఎంత ముఖ్యమో, అందులో ఫాస్ట్‌గా టైప్ చేయడం అంతకంటే ముఖ్యం. చాలా మంది యూజర్లు కీబోర్డ్‌లోని బేసిక్ ఫీచర్లు మాత్రమే వాడి వదిలేస్తుంటారు. కానీ గూగుల్ కీబోర్డ్ లేదా ఇతర మోడర్న్ కీబోర్డ్‌లలో మన పనిని ఇట్టే ఈజీ చేసే పవర్‌ఫుల్ ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. వీటిని వాడటం వల్ల చాలా ఫాస్ట్ గా టైప్ చేయొచ్చు. దీనికి సంబంధించిన రహస్య ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వేరే భాషలో మాట్లాడే వారితో చాట్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? ఇకపై వేరే ట్రాన్స్‌లేషన్ యాప్‌లను ఓపెన్ చేయాల్సిన పనే లేదు. మీ కీబోర్డ్ పైనే ఉన్న ట్రాన్స్‌లేట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే చాలు. మీరు తెలుగులో టైప్ చేస్తుంటే అది రియల్ టైటంలో ఇంగ్లీష్‌లోకి లేదా మీకు నచ్చిన ఇతర భాషలోకి ఆటోమేటిక్‌గా మారుస్తుంది. ఇతర భాషల్లో మాట్లాడే మీ స్నేహితులతో చాట్ చేసేవారికి ఈ ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది.
మనం ఏదైనా టెక్స్ట్ కొత్తది కాపీ చేయగానే పాతది మాయమైపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ‘క్లిప్‌బోర్డ్’ ఫీచర్ ఉంది. కీబోర్డ్‌లో క్లిప్‌బోర్డ్‌ను ఆన్ చేసుకుంటే.. మీరు కాపీ చేసిన ప్రతీ టెక్స్ట్, లింక్ అన్నీ ఒకే చోట సేవ్ అవుతాయి. దీంతో వేర్వేరు యాప్‌ల నుంచి పదే పదే టెక్స్ట్ కాపీ-పేస్ట్ చేసే టెన్షన్ తప్పుతుంది.
చేతులతో టైప్ చేసి అలసిపోయారా? లేదా పెద్ద పెద్ద మెసేజ్‌లు పంపాల్సి వస్తోందా? కీబోర్డ్ కుడి వైపున ఉండే మైక్ ఐకాన్‌పై క్లిక్ చేసి మాట్లాడటం ప్రారంభించండి. మీరు ఏది చెబితే అది కీబోర్డ్ క్షణాల్లో టైప్ చేస్తుంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలా ఏ భాషలోనైనా మాట్లాడి టైప్ చేయవచ్చు. ఇది మీ టైపింగ్ స్పీడ్‌ను విపరీతంగా పెంచేస్తుంది.
ఎవరిదో ఒకరి ఫోన్ నంబర్ పంపడానికి కాంటాక్ట్స్ యాప్‌లోకి వెళ్లి నంబర్ వెతికి కాపీ చేసే పనే లేదు. గూగుల్ కీబోర్డ్ సెట్టింగ్స్‌లో ‘సజెస్ట్ కాంటాక్ట్స్’ ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు నేరుగా కీబోర్డ్ నుంచే ఏ కాంటాక్ట్ వివరాలనైనా ఈజీగా యాక్సెస్ చేసి క్షణాల్లో షేర్ చేయవచ్చు.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్
మీరు రోజూ తరచుగా వాడే పొడవైన అడ్రస్ లేదా పెద్ద వాక్యాల కోసం సొంత షార్ట్‌క ట్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ‘Add’ అని టైప్ చేస్తే మీ పూర్తి అడ్రస్ ఆటోమేటిక్‌గా స్క్రీన్ మీద వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఇది మీ రోజూవారీ టైపింగ్ టైమ్‌ను చాలా వరకు ఆదా చేస్తుంది.
చూసారా ! కేవలం చిన్న సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మీ ఫోన్ కీబోర్డ్ ఎంత పవర్‌ఫుల్‌గా మారుతుందో. ఈ ట్రిక్స్ అన్నీ ఇప్పుడే మీ ఫోన్‌లో ట్రై చేసి మీ టైపింగ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చుకోండి!