E-Paper
Advertisement

అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం.. విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..

అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం..  విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..
Advertisement

నిను వీడ‌ని నీడ‌ను నేనే.. అన్న‌ట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వ‌ద‌ల‌డం లేదు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ పార్టీ ఆందోళ‌న ఉద్రిక్తంగా మారిన నాటి నుంచి అమిత్ షాను టార్గెట్ చేస్తున్నారాయ‌న‌. విద్యార్థుల‌పై లాఠీ చార్జి చేయ‌డ‌మే కాదు.. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ర‌బ్బ‌ర్ బుల్లెట్లు వాడి వారిని గాయ‌ప‌రిచారు. దీనిపై రాహుల్ అప్ప‌టి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు.

పెల్లెట్ గ‌న్ దెబ్బ‌కు త‌న చూపు కోల్పోయిన విద్యార్థితో క‌లిసి ఇవాళ‌ ఉద‌యం నుంచి ఢిల్లీలో ఆందోళ‌న చేశారు రాహుల్‌. బాధిత విద్యార్థి ఫిర్యాదు చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని పోలీసులపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌ త‌ప్ప‌లేదు పోలీసుల‌కు.

Advertisement

మొన్న పార్ల‌మెంటులో అమిత్ షాను నిల‌దీసే క్రమంలో చేసిన ఇండి కూట‌మి పోరాటం ఫ‌లించింది. స‌భ‌కు హాజ‌రు కాకుండా త‌ప్పించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది కేంద్ర మంత్రికి. స‌భ‌కు రావాల‌ని, క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, రాజీనామా చేయాల‌ని రాహుల్ చేసిన పోరాటం.. బీజేపీ పెద్ద‌ల‌ను ఇబ్బంది పెట్టింది. ఇక‌పై జంత‌ర్ మంత‌ర్ వ‌ద్దే కాదు.. ఢిల్లీలో ఎక్క‌డ యువ‌త ఆందోళ‌న చేసినా.. విద్యార్థులు ఎక్క‌డ రోడ్డెక్కినా లాఠీలు ఎత్తాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితిని క్రియేట్ చేశారు రాహుల్ గాంధీ.

ఆది నుంచి ఆయ‌న జెన్‌జీల‌కు మ‌ద్ద‌తుగానే ఉంటూ వ‌స్తున్నారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్ననాటి నుంచి త‌న సంఘీభావం తెలుపుతూ వ‌స్తున్నారు. పార్ల‌మెంటు ముట్ట‌డి ఉద్రిక్తంగా మారిన త‌రుణంలో వారికి అండగా ఉండి .. కాంగ్రెస్ కూట‌మితో క‌లిసి మెరుపు ధ‌ర్నా చేసి యువ‌తకు మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యారు.

Advertisement

ఏ వేదిక మీదెక్కినా ఈ అంశాన్ని వ‌ద‌ల‌డం లేదు రాహుల్‌. అమిత్ షాను వెంటాడుతూనే ఉన్నారు. ఇప్ప‌టికీ రాజీనామా చేయాల‌నే డిమాండ్‌ను స‌జీవంగానే ఉంచుతున్నారు. అమిత్ షా దీన్ని మ‌రిచిపోదామ‌ని అనుకున్నా.. మ‌ర‌వ‌నీయ‌కుండా జంత‌ర్ మంత‌ర్ చేదు అనుభ‌వాల‌ను జ్ఞ‌ప్తికి తెస్తూ ఇబ్బంది పెడుతున్నారు.

రాజకీయంగా ఇరుకున పెడుతున్నారు. తాజాగా పెల్లెట్ గ‌న్ బాధితుడి ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డ‌మంటే కేంద్రం త‌న త‌ప్పు ఒప్పుకోవ‌డ‌మే అవుతుంది. రాహుల్ వ్యూహంలో అమిత్ షా, మోడీ ద్వ‌యం చిక్కుకున్నార‌ని ఈ ఉదంతం తెలియ‌జేస్తోంది.

Tags

Related News

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

Big Stories

Advertisement
×