Budget Phone: మీరు కేవలం 2 వేల రూపాయల్లో మంచి ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే HMD సంస్థ తక్కువ ధరల్లో రెండు ఫోన్లను రిలీజ్ చేసింది. వీటిలో అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్, సంగీత ప్రియుల కోసం మ్యూజిక్ ఫీచర్ సహా అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
రెండు ఫోన్‌లు
HMD 130 మ్యూజిక్, HMD 150 మ్యూజిక్ పేరిట విడుదలైన ఈ రెండు ఫోన్‌లు సంగీత ప్రియులు, అలాగే సెకండరీ ఫోన్ కోసం చూస్తున్న వారికి మంచి ఎంపికలుగా ఉంటాయి. వినూత్న ఆడియో అనుభవంతో పాటు, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో వీటిని రూపొందించారు. ఈ రెండు ఫోన్‌లు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అందుబాటులో ఉన్నాయి.
-HMD 130 మ్యూజిక్ – రూ.1,899
-HMD 150 మ్యూజిక్ – రూ. 2,399
ఈ ఫోన్‌లను HMD అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయవచ్చు.
రంగుల ఎంపిక:
-HMD 130 మ్యూజిక్ – బ్లూ, డార్క్ గ్రే, రెడ్
-HMD 150 మ్యూజిక్ – లైట్ బ్లూ, పర్పుల్, గ్రే
Read Also: Top 5 AC Deals: టాప్ 5 ఏసీలపై బెస్ట్ డీల్స్..50% తగ్గింపు …
సంగీత ప్రియుల కోసం ప్రత్యేకమైన ఆడియో ఫీచర్లు
-HMD ఈ రెండు ఫోన్‌లను సంగీత ప్రియులను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది.
-శక్తివంతమైన స్పీకర్లు – పెద్ద స్పీకర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లు అధిక శబ్దంతో నాణ్యమైన సంగీత అనుభవాన్ని అందిస్తాయి.
-డెడికేటెడ్ మ్యూజిక్ బటన్ – సంగీతాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకమైన బటన్‌లు అందుబాటులో ఉన్నాయి.
-ఇన్-బాక్స్ ఇయర్‌ఫోన్లు – సంగీత వినడానికి ఇయర్‌ఫోన్లు కూడా వస్తాయి.
-FM రేడియో (వైర్డ్ & వైర్‌లెస్) – ఏదైనా హెడ్‌ఫోన్ అవసరం లేకుండా కూడా రేడియో వినవచ్చు.
-FM రికార్డింగ్ – మీకు నచ్చిన పాటలను రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
శక్తివంతమైన బ్యాటరీ లైఫ్
-2,500mAh బ్యాటరీ
-50 గంటల వరకూ మ్యూజిక్ ప్లేబ్యాక్
-36 రోజుల స్టాండ్‌బై టైమ్
ఫాస్ట్ ఛార్జింగ్
HMD 130 & 150 మ్యూజిక్ ఫోన్‌లు శక్తివంతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. దీని వల్ల దాదాపు రెండు రోజుల పాటు ఛార్జింగ్ అందిస్తుంది.
స్మార్ట్ ఫీచర్లు
-UPI చెల్లింపులు – డిజిటల్ లావాదేవీలకు మద్దతు.
-టెక్స్ట్-టు-స్పీచ్ – హిందీ, ఇంగ్లీష్‌లో టెక్స్ట్‌ను వాయిస్‌గా వినిపించే ఫీచర్.
-బ్లూటూత్ & కాల్ రికార్డింగ్ – అవసరమైన అన్ని ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు తక్కువ ధరలో, దీర్ఘకాలిక బ్యాటరీ, మంచి ఆడియో, UPI చెల్లింపుల సపోర్ట్ వంటి అనేక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.
హెచ్‌ఎండీ & రాజస్థాన్ రాయల్స్ భాగస్వామ్యం
IPL 2025 కోసం, HMD గ్లోబల్ రాజస్థాన్ రాయల్స్‌తో అధికారిక స్మార్ట్‌ఫోన్ భాగస్వామ్యాన్ని ఉంది. ఇది బ్రాండ్ విజిబిలిటీని పెంచడమే కాకుండా, మరింత మంది వినియోగదారులను చేరుకోవడానికి సహాయపడుతుంది.
త్వరలో వస్తున్న 5G స్మార్ట్‌ఫోన్
HMD త్వరలో తన తొలి 5G ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ ని భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది అధునాతన కనెక్టివిటీతో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందించనుంది.