Big Tv Live Originals: వాట్సాప్ లో చాలా ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి బ్లూ టిక్స్. ఎదుటి వారికి పంపిన మెసేజ్ చదివినట్లుగా తెలిసేందుకు ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, కొంత మంది తమ గోప్యతను కాపాడుకునేందుకు, మరికొంత మంది వెంటనే రిప్లై ఇవ్వడం లేక బ్లూ టిక్స్ ఆపేస్తారు. అయితే, ఇలాంటి వారి మనస్తత్వం కాస్త డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు నిపుణులు.
⦿ ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత
బ్లూ టిక్ లను ఆఫ్ చేసే వాళ్లు తమ ప్రైవసీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లు మెసేజ్ చదివారో? లేదో? వెల్లడించేందుకు ఇష్టపడుతారు. అంతేకాదు, వారు తమకు పంపిన మెసేజ్ లను చదువుతున్నారో? లేదో? అనే విషయం కూడా ఇతరులకు తెలియకూడదనుకుంటారు.
⦿ అనవసరమైన ఒత్తిడిని నివారించడం
సాధారణంగా వాట్సాప్ మెసేజ్ చదవగానే బ్లూ టిక్ పడుతుంది. కొన్నిసార్లు ఆ మెసేజ్ కు రిప్లై ఇచ్చే టైమ్ ఉండదు. కానీ, ఆ మెసేజ్ పంపిన వ్యక్తులు, చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదని హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, అనవసరమైన ఒత్తిడి లేకుండా బ్లూ టిక్స్ ఆపేస్తుంటారు.
⦿ ఆత్మవిశ్వాసం ఎక్కువ
కొంత మంది తమ స్వాతంత్ర్యాన్ని చెప్పుకునేందుకు బ్లూ టిక్స్ ఆపేస్తారు. ఈ వ్యక్తులు తమ స్వేచ్ఛను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇతరుల చర్యలు, అంచనాల ప్రభావానికి లోనవకుండా ఉండటానికి ఇష్టపడతారు. తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, స్వంత నిబంధనల ప్రకారం తమ సమయాన్ని మెయింటెయిన్ చేసుకోవడానికి బ్లూ టిక్స్ ఆపేస్తారు.
⦿ బాధ్యతాయుతమైన ప్రతిస్పందన దారులు
బ్లూ టిక్ లను ఆపివేసే కొందరు తమకు వచ్చిన మెసేజ్ లకు రిప్లై ఇవ్వడానికి ముందు కొంత టైమ్ ను తీసుకోవచ్చు. ఎదుటి వారికి వచ్చే సమాధానం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. త్వరగా సమాధానం ఇవ్వడానికి బదులుగా ఆలోచనాత్మక సమాధానాలు ఇవ్వాలనుకుంటారు. అందుకే బ్లూ టిక్ లను ఆపివేసి తమ మీద ఒత్తిడి లేకుండా చూసుకుంటారు.
⦿ జాగ్రత్త, అపనమ్మకం ఉన్న వ్యక్తులు
కొన్ని సందర్భాల్లో, బ్లూ టిక్ లను ఆపివేయడం ద్వారా కొంత మంది జాగ్రత్త ఉండాలని భావిస్తారు. ఈ వ్యక్తులు గోప్యత చాలా అవసరం అని భావిస్తారు. వారు తమ ఆలోచనలు, ప్రతి స్పందనలను ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా సున్నితమైన సంభాషణల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు.
Read Also: హైదరాబాద్ నుంచి మనాలి టూర్ ప్లాన్ చేస్తున్నారా? జస్ట్ రూ. 12 వేలలో వెళ్లి రావచ్చు తెలుసా?
⦿ మానసిక ప్రశాంతతను కోరుకోవడం
బ్లూ టిక్‌లను ఆఫ్ చేయడం అనేది నిరంతర నోటిఫికేషన్లను, వాటితో వచ్చే ఒత్తిడిని నివారించడానికి ఒక మార్గంగా భావిస్తారు. బ్లూ టిక్ లను ఆఫ్ చేయడం ద్వారా వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తారు. తొందరపడకుండా ఫ్రీ టైమ్ లో ప్రశాంతంగా సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడుతారు.
Read Also: మీ కళ్ల జోడు కారును పేల్చేస్తుంది.. ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి!