E-Paper
Advertisement

11000mAh బ్యాటరీ, 10,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో Honor X80 Pro Max లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

11000mAh బ్యాటరీ, 10,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో Honor X80 Pro Max లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

Honor X80 Pro Max: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్ సరికొత్త రికార్డులతో చైనా మార్కెట్లో ‘హానర్ X80 ప్రో మాక్స్’ మోడల్‌ను లాంచ్ చేసింది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్, మునుపెన్నడూ చూడని డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీనిలో 6.8 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఏకంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల నడిఎండలో నిలబడి ఫోన్ చూసినా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రాచ్‌లు పడకుండా గట్టి గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.

Advertisement

హానర్ X80 ప్రో మాక్స్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. దీనివల్ల గేమ్స్ ఆడినా, మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

Also Read: ఆఫీస్ మెయిళ్లు, నోటిఫికేషన్ల టార్చర్.. 25 ఏళ్లకే బర్నౌట్ అవుతున్న Gen Z, బయటపడే మార్గమే లేదా?

Advertisement

ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ దీనిలోని 11,000mAh భారీ బ్యాటరీ. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే దీనికోసం 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అంతేకాదు.. అత్యవసర సమయాల్లో వేరే గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవడానికి 27W రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉండటం విశేషం.

ఫోన్ వెనుక వైపు OIS సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది కదిలేటప్పుడు కూడా స్థిరమైన ఫొటోలను ఇస్తుంది. ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. అలాగే ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే ధూళి, నీటితో పాటు హై-ప్రెజర్ వాటర్ జెట్స్ పడినా కూడా ఫోన్ చెక్కుచెదరదు.

ఈ ఫోన్ బేస్ వేరియంట్ (8GB+128GB) ధర చైనాలో దాదాపు రూ.28,000గా ఉంది. అలాగే టాప్ వేరియంట్ (12GB+512GB) ధర దాదాపు రూ.39,000 వరకు ఉంటుంది. ఇది జూన్ 26 నుంచి చైనాలో రెడ్, వైట్, బ్లాక్, ఆరెంజ్ రంగుల్లో అమ్మకానికి రానుంది.

Also Read: ల్యాప్‌టాప్ చరిత్రలోనే మొదటిసారి.. 96GB గ్రాఫిక్స్ మెమరీతో Lenovo Yoga Pro 7!

Related News

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026.. సౌండ్‌బార్‌లపై భారీ డిస్కౌంట్లు!

దుమ్ము లేని ఇల్లు కావాలా ? రూ.30వేలలోపు టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు!

తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే 5 ల్యాప్‌టాప్స్

కేంద్రంతో రూ.5,000 కోట్ల వివాదం.. Airtel, Vi కు సుప్రీం కోర్టు నోటీసులు!

రోజుల తరబడి వాడినా ఫోన్ ఛార్జింగ్ అయిపోకూడదా? అయితే ఈ సీక్రెట్ సెట్టింగ్స్ ఇప్పుడే మార్చండి!

లిక్విడ్ లేదా పౌడర్ డిటర్జెంట్..మీ బట్టలకు ఏది బెస్ట్? నిపుణుల సలహా!

రీల్స్ అలా చూశాడో లేదో.. ఖాతా నుంచి రూ.లక్ష స్వాహా.. ఇదో కొత్త రకం సైబర్ స్కామ్!

ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లతో.. కొత్త మోడల్ లాంచ్

Big Stories

Advertisement
×