Intinti Ramayanam Today Episode july 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి ఆ ఇంటికి నాకు అసలు వెల్లబుద్దే కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. భానుమతి మాత్రం నువ్వు ఆ ఇంట్లో ఉన్న కొడుకుల కోసమే వెళ్తున్నావ్ వేరే వాళ్ల కోసం వెళ్లట్లేదు కదా అనేసి అంటుంది. అక్షయ్ కి ఏమి రాదు అత్తయ్య నువ్వే చూసుకోవాలి అని భానుమతి తో పార్వతి అంటుంది. నువ్వేమన్నా చిన్నపిల్లని హాస్టల్లో వదిలి వెళ్తున్నావా ఏంటి? నేను అన్ని చూసుకుంటాను వంట దగ్గర నుంచి వాడికి ఏం కావాలో అన్ని దగ్గరుండి నేను చేస్తాను అని భానుమతి అంటుంది. పద రాహుకాలం వచ్చేలోగా ఇకనుంచి వెళ్లాలి అని పార్వతిని రెడీ చేస్తుంది. పల్లవి శ్రియ ఇద్దరు మందు తాగినట్లు నటిస్తారు. కాదు కమల్ శ్రీకర్ ఇద్దరినీ చావ కొడతారు. వీళ్లు నిజంగానే తాగారా లేదో తెలుసుకోవాల అన్నయ్య అని కమల్ టెస్ట్ చేస్తాడు.. అయితే వాళ్ళిద్దరూ తాగలేదని తెలియడంతో వాళ్ళిద్దర్నీ కొడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి వెళ్లడానికి ఆటోని బుక్ చేయబోతుంటాడు అక్షయ్. అత్తయ్య గారు మీరు నా బండి మీద రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అవని అంటుంది. కానీ పార్వతి మాత్రం అస్సలు వినదు. వెళ్లకుండా అయినా ఉంటాను కానీ నీతో పాటు నేను ఎక్కడికి రాను అని అంటుంది. అక్షయ్ కూడా అమ్మ కోసం నేను ఆటో బుక్ చేస్తున్నాను నీ అవసరం మాకు ఏం అవసరం లేదు అని మొహం మీదే చెప్పేస్తాడు.. అయితే ఈరోజు ఆటోలు క్యాబ్లు అన్ని బంద్ మీరు మీ అబ్బాయి బుక్ చేసినట్లుగానే నా బండి మీద రండి అని అవని అంటుంది. పార్వతిని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
అత్తయ్య ఇంకా రాలేదు ఏంటి అని పల్లవి శ్రీయా ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు.. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన అవనిని చూసి ఇద్దరు షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ ఇలా ఇస్తావని అనుకోలేదు అని పల్లవి, శ్రీయా అంటారు.. నా ఇంటికి నేను వస్తే నీకేంటి ప్రాబ్లం అని పల్లవిని అవని అడుగుతుంది. నా ఇల్లు అన్న సంగతి మీరు మర్చిపోయినట్లున్నారు అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది.. నేనేమీ ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. అత్తయ్య తీసుకుని వచ్చాను అని అంటుంది.. అత్తయ్య అని పిలవగానే పార్వతి ఇంట్లోకి వస్తుంది..
మీరేంటి అత్తయ్య ఈ అవని అక్కతో వచ్చారు అని పల్లవి అడుగుతుంది.. ఈరోజు ఆటోలు క్యాబ్లు అన్ని బంద్ అంట అందుకే ఈవిడతో రావాల్సి వచ్చింది అని పార్వతి అంటుంది.. అయితే కమల్ శ్రీకర్ వీరిద్దరిని చూసి సంతోషంగా ఫీల్ అవుతారు. హారతి ఇచ్చి లోపలి తీసుకురమ్మని పల్లవిశ్రియాలతో అంటారు.. వాళ్లు హారతి ఇచ్చి అవనీని పార్వతిని లోపలికి తీసుకొని వస్తారు.
అవని వెళ్ళిపోతుంటే పల్లవి ఆపి నువ్వు ఈ ఇంట్లోకి వద్దాం అని అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు. ఈ కుటుంబం కలుస్తుందని ఆశలు పెట్టుకున్నావేమో అవి ఆవిరి అయిపోవాల్సిందే అని అంటుంది. ఇప్పుడు అత్తయ్య తీసుకుని వచ్చినట్లే రేపు మామయ్యను తీసుకొని వస్తాను. తర్వాత ఒక్కొక్కరిని ఇంటికి తీసుకొచ్చి కుటుంబాన్ని మళ్లీ కలుపుతాను అని అవని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. నీ ఆటలు కట్టించే రోజు త్వరలోనే వస్తుంది నువ్వు జాగ్రత్త పడు అని అవని అంటుంది.
Also Read : బాలు ను క్షమించని బాలు.. రవికి షాకిచ్చిన శృతి.. బాలు, మీనా బయటకు వెళ్తారా..?
కమల్ మాత్రం వదిన చేసిన పనికి మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తాడు. నువ్వు చెప్పినట్లే అమ్మ ఇంటికి వచ్చింది వదిన ఇంకా నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కలవడమే అని అంటాడు.. అది కూడా త్వరలోనే జరుగుతుంది నువ్వు ఏమి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కన్నయ్య అని అంటుంది. సరే వదిన అని అన్నగాని పల్లవి చాటున వింటూ ఉంటుంది. దానికి కమల్ అవని అక్కడెందుకు వినడం ఇక్కడికి వచ్చి వినొచ్చు కదా అని అంటారు. మీ మాటలు వినలేదు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోండి అని వెళ్ళిపోతుంది. అక్షయ్ ఫుడ్ తినకపోవడంతో బయట ఏదైనా తినాలని అనుకుంటాడు. బయట ఫుడ్డు తిన్న తర్వాత బయటికి వచ్చి వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అవని చూసి అక్షయ్కు నీళ్లు ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..