Honor X9c 5G vs OnePlus Nord CE 5 vs Vivo Y400 Pro 5G| భారత్‌లో మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. వన్‌ప్లస్ నార్డ్ CE 5, హానర్ X9c 5G, మరియు వివో Y400 ప్రో 5G ఈ మూడు కొత్త ఫోన్లు గొప్ప ఫీచర్లను సరసమైన ధరల్లో అందిస్తున్నాయి. ఈ మూడింటిలో ఏది మీకు సరైనదో తెలుసుకోవడానికి ధర, డిజైన్, డిస్‌ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి అంశాలను పోల్చి చూద్దాం.
ధర, స్టోరేజ్
వన్‌ప్లస్ నార్డ్ CE 5 ధర 8GB RAM + 128GB స్టోరేజ్‌కు రూ.24,999, 8GB RAM + 256GB స్టోరేజ్‌కు రూ.26,999. హానర్ X9c 5G అతి తక్కువ ధరతో, 8GB RAM + 256GB స్టోరేజ్‌కు రూ.21,999లో లభిస్తుంది. వివో Y400 ప్రో 5G ధర 8GB RAM + 128GB స్టోరేజ్‌కు రూ.24,999, 8GB RAM + 256GB స్టోరేజ్‌కు రూ.26,999. తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే హానర్ X9c 5G బెస్ట్.
డిస్‌ప్లే, డిజైన్
వన్‌ప్లస్ నార్డ్ CE 5లో 6.77-అంగుళాల OLED డిస్‌ప్లే, 2392×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి, ఇది స్క్రోలింగ్, గేమింగ్‌కు సూపర్‌గా ఉంటుంది. హానర్ X9c 5Gలో 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 1224×2700 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ బైట్‌నెస్ ఉన్నాయి. బయట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వివో Y400 ప్రో 5Gలో 6.77-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్‌ప్లే, 2392×1080 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ బైట్‌నెస్ ఉన్నాయి. ఇది మూడింటిలో అత్యధిక ప్రకాశాన్ని అందిస్తుంది. వివో, హానర్ డిస్‌ప్లేలు బైట్‌నెస్ విషయంలో కొంచెం మెరుగ్గా ఉన్నాయి.
పర్‌ఫామెన్స్
వన్‌ప్లస్ నార్డ్ CE 5లో 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎపెక్స్ ప్రాసెసర్ ఉంది, ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు వేగవంతం. హానర్ X9c 5Gలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ఉంది, ఇది రోజువారీ పనులు మరియు సాధారణ గేమింగ్‌కు సరిపోతుంది. వివో Y400 ప్రో 5Gలో 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది, ఇది సమతుల్య పనితీరును అందిస్తుంది. గేమింగ్, ఇతర హెవీ మల్టీ టాస్కింగ్ పనులకు నార్డ్ CE 5 మెరుగైన ఎంపిక.
ఆపరేటింగ్ సిస్టమ్
మూడు ఫోన్లూ ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తాయి. నార్డ్ CE 5లో ఆక్సిజన్ OS 15 ఉంది, ఇది స్వచ్ఛమైన, సాఫీగా ఉంటుంది. హానర్ X9c 5Gలో మ్యాజిక్ OS 9.0, వివో Y400 ప్రో 5Gలో ఫన్‌టచ్ OS 15 ఉన్నాయి. బ్లోట్‌వేర్ లేని అనుభవం కావాలంటే నార్డ్ CE 5 ఉత్తమం.
కెమెరా
నార్డ్ CE 5లో 50MP సోనీ LYT-600 మెయిన్ కెమెరా (OISతో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. హానర్ X9c 5Gలో 108MP మెయిన్ కెమెరా (OISతో), 5MP వైడ్-యాంగిల్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వివో Y400 ప్రో 5Gలో 50MP మెయిన్ కెమెరా (OISతో), 2MP డెప్త్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫోటోగ్రఫీకి హానర్, సెల్ఫీలకు వివో మెరుగైనవి.
కనెక్టివిటీ
మూడు ఫోన్లలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C ఉన్నాయి. నార్డ్ CE 5లో NFC కూడా ఉంది. హానర్‌లో OTG, వివోలో డ్యూయల్ 4G VoLTE ఉన్నాయి. అన్నీ వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తాయి.
బ్యాటరీ, ఛార్జింగ్
నార్డ్ CE 5లో 7,100mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ ఉన్నాయి. హానర్ X9c 5Gలో 6,600mAh బ్యాటరీ, 66W ఛార్జింగ్, వివో Y400 ప్రో 5Gలో 5,500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ ఉన్నాయి. బ్యాటరీ జీవితానికి నార్డ్, వేగవంతమైన ఛార్జింగ్‌కు వివో బెస్ట్.
Also Read: బంగారం కొనుగోలు చేస్తే నష్టమే.. ETFలు బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
వన్‌ప్లస్ నార్డ్ CE 5 (రూ.24,999 నుండి) పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, స్వచ్ఛమైన సాఫ్ట్‌వేర్ కావాలనుకునే వారికి గ్రేట్ ఆప్షన్. హానర్ X9c 5G (రూ.21,999) తక్కువ ధరలో 108MP కెమెరా, ప్రకాశవంతమైన డిస్‌ప్లేను అందిస్తుంది. వివో Y400 ప్రో 5G (రూ.24,999 నుండి) వేగవంతమైన 90W ఛార్జింగ్, 32MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. గేమింగ్, బ్యాటరీ కావాలంటే నార్డ్, ఫోటోగ్రఫీకి హానర్, సెల్ఫీలు వేగవంతమైన ఛార్జింగ్‌కు వివో ఎంచుకోండి.