Rainbow: ఇంద్రధనుస్సు అనగానే మనకు ఆకాశాన్ని చుట్టేసిన ప్రకృతిలోని ఒక అందమైన దృశ్యం, దానిలోని ఏడురంగులు గుర్తుకు వస్తాయి. ఇంద్రధనుస్సును మనం నిజజీవితంలో, సినిమాల్లో, వీడియోలలో చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఇది ఎలా ఏర్పడుతుందన్న విషయం మనలో చాలామందికి తెలీదు. ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది, దానిలో ఏడురంగులు మాత్రమే ఎందుకుంటాయి అన్న సందేహం మనలో చాలామందికి చాలాసార్లు వచ్చే ఉంటుంది. అయితే, అందమైన ఈ ఇంద్రధనుస్సు ఏర్పడటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కారణం ఏంటి?
సూర్యకాంతి, వర్షపుచినుకుల ద్వారా సపరేట్ అయ్యి వక్రీకరించి పరావర్తనం ద్వారా ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్‌లో సూర్యకాంతి ఏడు రంగులుగా విడిపోయి ఆకాశంలో అర్ధవృత్తాకార బ్యాండ్ గా కనిపిస్తుంది. అయితే, ఇంద్రధనుస్సు ఏర్పడడానికి సూర్యకాంతి, వర్షపు చినుకులు, సరైన కోణం మూడు ముఖ్యమైన కారణాలు. వర్షం కురుస్తున్నప్పుడు లేదా కురిసిన తరువాత ఆకాశంలో ఉన్న నీటిచినుకుల గుండా సూర్యకాంతి ప్రవేశిస్తుంది. ఈ సూర్యకాంతి ఒక తెల్లని కాంతికిరణం, వివిధ వేవ్ లెన్త్‌లు ఉన్న కాంతిని కలిగి ఉంటుంది. అలా ప్రవేశించినప్పుడు ఈ కాంతి దాని దిశను మార్చుకుంటుంది. ఇలా దాని దిశను మార్చుకున్న కాంతిలోని రకరకాల వేవ్ లెన్త్‌లు విడిపోతే దానిని రెయింబో అని పిలుస్తారని సైంటిస్టులు చెబుతున్నారు.
VIBGYOR అంటే?
నీటి చినుకు లోపలి ఉపరితలంపై కంటి పరావర్తనం చెంది బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ లో కాంతి మరోసారి వక్రీకరణం చెంది ఏడు రంగులుగా విడిపోయి మనకి ఇంద్రధనుస్సుగా కనిపిస్తుంది. ఆ ఏడు రంగులు వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. వీటినే VIBGYOR అని కూడా అంటారు. ఏడు రంగులు ఆకాశంలో 42 డిగ్రీల స్థిరమైన కోణంలో ఏర్పడి మనకి ఇంద్రధనుస్సుగా కనిపిస్తుంది.
7 రంగులే ఎందుకు కనిపిస్తాయి?
ఇంద్రధనుస్సులో ఏడు రంగులు మాత్రమే ఏర్పడటానికి కారణం సూర్యకాంతిలోని విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్‌లో మనిషి కంటికి ఏడు రంగులుగా కనిపించే ఏడు వేవ్ లెన్త్ లు ఉంటాయి. ప్రతి రంగు ఒక ఖచిత వేవ్ లెన్త్‌ను సూచిస్తుంది. నీటి చినుకుల ద్వారా సపరేట్ అయినప్పుడు ఈ వేవ్ లెన్త్ లు విడిగా కనిపిస్తాయి. మనం దీనిని ప్రిజం ఎక్స్పరిమెంట్ లో కూడా గమనించవచ్చు.
సైన్స్‌తో ముడి పడిన అద్భుతం
ఇంద్రధనుస్సు ఒక వ్యక్తిగత దృగ్విషయం. ఇది ఒక ఖచిత స్థానంలో ఉన్న వీక్షకుడు, సూర్యుడు, వర్షపు చినుకుల మధ్య ఏర్పడే కోణంపై ఆధారపడి ఉంటుంది. దీని కారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంద్రధనుస్సును ఒకే విధంగా చూడలేరు. వారు చూసే కోణంలో మార్పు ఉంటుంది. ఈ ప్రకృతి సౌందర్యం సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ తో ముడిపడిన ఒక అద్భుతం అని సైంటిస్టులు అంటారు.