Shiva Jyothi: బుల్లితెర యాంకర్ శివజ్యోతి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంత కాదు. తీన్మార్ కార్యక్రమంతో తన కెరీర్ ప్రారంభించిన శివజ్యోతి న్యూస్ రీడర్, యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన భర్త గంగోలితో శివ జ్యోతి సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్లు పెడుతూనే ఉంటారు. ఇక రాజకీయంగా అప్పట్లో బిఆర్ఎస్ కి సపోర్ట్, తెలంగాణలో ఆ పార్టీకి సంబంధించిన రీల్స్ ను వీడియోలుగా చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈమెని ఎంతో మంది ట్రోలింగ్ చేసినట్లు కూడా ఆమె తెలిపింది. ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె పెట్టే ప్రతి వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు మరోసారి పెళ్లి అంటూ గుడిలో జరిగిన పెళ్లి వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో నిమిషాల్లో వైరల్ అయింది. ఆ వివరాలు చూద్దాం..
మళ్లీ పెళ్లి చేసుకున్న శివజ్యోతి..
వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. శివజ్యోతి తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానంటు.. తన పెళ్లి రోజు సందర్భంగా మరోసారి పెళ్లి చేసుకొని ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. శివ జ్యోతి, గంగోలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ గురించి వారి గ్రామంలో తెలిసి ఇంట్లో నుంచి కట్టు బట్టలతో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడు సంవత్సరాలు గంగోలి ఆమెని హైదరాబాదులో హాస్టల్లో ఉంచి చదివించిన విషయం ఆమె బిగ్ బాస్ వేదికగా తెలిపారు. ఇక వీరిద్దరికి పెళ్లయి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్లీ మరోసారి గుడిలో వివాహం చేసుకున్నారు. ఎంతో సంతోషంగా అందరి బంధువుల సమక్షంలో శివజ్యోతి మెడలో మరోసారి గంగోలి తాళిని వేసి, కాళ్లకు మెట్టలను పెట్టి.. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పెళ్లిరోజు అభిమానులకు సప్రైజ్ ఇచ్చిన శివజ్యోతి..
ఇక వీరి ఇరువురికి పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతున్నా, ఇంతవరకు పిల్లలు లేకపోవడం గురించి ఎంతోమంది వీరిని అడిగారు. కానీ ఆ కామెంట్స్ కు శివ జ్యోతి గాని, గంగోలి కానీ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. అసలు వారిద్దరూ నెగటివ్ కామెంట్లను దగ్గర కూడా రానివ్వరు. తాజాగా శివజ్యోతి తమ పది సంవత్సరాల బంధానికి, మరోసారి పెళ్లి అంటూ ఓ వీడియోని షేర్ చేసి, మళ్లీ పెళ్లి అంటూ రివీల్ చేసిన ఈ వీడియో నెట్టింటి వైరల్ అవుతుంది. శివ జ్యోతి తన వ్యక్తిగత విషయాలను, డ్రెస్సింగ్, మేకప్ గురించి వీడియోలను చేస్తూ, వాటిని అభిమానులతో పంచుకుంటుంది. ఈమెని ఎంతోమంది నెగిటివ్ గా కామెంట్లు చేసిన అవేమీ పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది.
Monalisa : మోనాలిసా మోస పోలేదు.. స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ.. ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తుందో మీరే చూడండి
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==