In-Flight Wifi : విమాన ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఇంటర్నెట్. ఇంటర్నెట్ విమాన ప్రయాణాల్లో అందుబాటులో ఉండదు. ముఖ్యంగా మొబైల్ డేటా రానే రాదు. మరి వైఫైను అందిస్తున్న ఎయిర్ లైన్స్ పరిస్థితి ఏంటి? వాటికి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా..
విమాన ప్రయాణంలో మొబైల్ డేటా పనిచేయదు. ఎందుకంటే అంత ఎత్తులో మొబైల్ కి సిగ్నల్స్ అందవు సరి కదా.. ఒకవేళ పని చేసినా విమానానికి అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పలు విమాన సంస్థలు ఉచిత వైఫై ని అందిస్తున్నాయి. ఎయిర్ ఇండియా సైతం తాజాగా ఉచిత వైఫై సర్వీస్ ను ప్రారంభించింది. ప్రయాణికులకు ఈ సర్వీస్ ను ఉచితంగానే అందిస్తుంది. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఈ సదుపాయం ఉన్నప్పటికీ తాజాగా డొమెస్టిక్ ఫ్లైట్స్ లో సైతం పలు విమానయాన సంస్థలు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చేస్తున్నాయి. అయితే అసలు అంత ఎత్తులో విమానంలో వైఫై ఎలా పని చేస్తుందో తెలుసా!
విమానంలో అందించే వైఫై సదుపాయం రెండు ప్రధాన సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. అందులో ఒకటి ఎయిర్ టు గ్రౌండ్ సిస్టం. మరొకటి శాటిలైట్ బేస్డ్ వైఫై సిస్టం.
ఎయిర్ గ్రౌండ్ సిస్టం కింద విమానంలో అమర్చిన యాంటినా భూమిపై సమీపంలోని ఉండే టవర్ నుంచి సిగ్నల్ ను అందుకుంటుంది. అయితే ఈ కనెక్షన్ నిర్దిష్ట ఎత్తు వరకూ సజావుగానే పనిచేస్తూ ఉంటుంది. కానీ గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతంలో ఉన్న విమానం వెళితే మాత్రం అంతరాయం తప్పదు. అయితే గ్రౌండ్ టవర్లు సిగ్నల్ పైకి ప్రాజెక్ట్ చేస్తాయి. ఇవి విమానం దిగువ భాగంలోనే ఉంటాయి.
ఇక ఇంకొకటి శాటిలైట్ ఆధారంగా పనిచేసే వైఫై నెట్వర్క్ ఈ విధానం ఈ రోజుల్లో ఎక్కువగా అందుబాటులోకి వచ్చేసింది. గ్రౌండ్ స్టేషన్ నుంచి వచ్చే సిగ్నల్ శాటిలైట్ ద్వారా విమానంలోకి చేరుతుంది. ఈ వ్యవస్థలో కూడా యాంటినా విమానం పైన అమర్చబడి ఉంటుంది. సముద్రాలు వంటి గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతాల్లో సైతం కనెక్టివిటీని క్లియర్ గా అందించడానికి ఈ సాంకేతికత మరింతగా ఉపయోగపడుతుంది.
విమానాల్లో ఉండే రూటర్ల ద్వారా ప్రయాణికుల డివైజ్ లకు ఈ వైఫై సిగ్నల్ అందుతుంది. విమానం 3000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు శాటిలైట్ సర్వీస్ కు కనెక్ట్ అవుతుంది. అయితే విమానంలో ఉన్నప్పుడు మొబైల్ డేటా పరిమితంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సిగ్నల్స్ పైలెట్ నావిగేషన్, రాడార్ సిస్టమ్, గ్రౌండ్ కంట్రోల్ వంటి వాటికి అడ్డంకిగా మారే అవకాశం లేకుండా ఉండేందుకు లిమిట్ లోనే వైఫైను అందిస్తారు.
సో ఇలా అంత ఎత్తులో ఉండే విమానాల్లో సైతం ఎంతో తేలికగా వైఫైతో ఇంటర్నెట్ ను ఉపయోగించుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇందులో మరిన్ని వెసులుబాట్లు త్వరలోనే వచ్చే అవకాశం సైతం కనిపిస్తోంది.
ALSO READ : పిల్లల భద్రత ఇకపై మా బాధ్యత.. పేరెంట్స్ చేయాల్సింది ఆ ఒక్కటే – కేంద్రం