Rohit Sharma: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ( Border-Gavaskar Trophy ) లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ లేరు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనేది ఇప్పటికి పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ( Border-Gavaskar Trophy ) ఐదవ టెస్ట్ అయిన సిడ్ని టెస్టు మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అయ్యాడు. అయితే రోహిత్ శర్మకు బదులుగా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. Rohit Sharma
Also Read: Mohammed Waleed: పాకిస్థాన్ రూల్స్ అదుర్స్… ఇలా కూడా రనౌట్ కావాల్సిందే ?
ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ( Border-Gavaskar Trophy ) లో భాగంగా పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేసి మ్యాచ్ ను గెలిపించాడు. ఆ తర్వాత సిరీస్ లో భారత్ కు విజయం అనేది లేకుండా పోయింది. ఈ ఫలితాల కారణంగానే కోచ్ గంభీర్ కు, కెప్టెన్ రోహిత్ శర్మకు మధ్య విభేదాలు వచ్చాయని అనేక రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. రోహిత్ శర్మను ( Rohit Sharma ) కావాలనే తప్పిస్తున్నారు అనే సమాచారం కూడా ముందుగానే బయటకు వచ్చింది.
అయితే టాస్ జరుగుతున్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ…. రోహిత్ శర్మ ఈ టెస్ట్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. టీమ్ అవసరాల దృష్ట్యా రోహిత్ శర్మ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడని తమ కెప్టెన్ ఇలా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా తమ టీమ్ లో ఉన్న ఐకమత్యం ఏంటో చూపిస్తుందని అన్నాడు. రోహిత్ శర్మకు బదులుగా గిల్ జట్టులోకి వస్తే, గాయపడిన ఆకాశదీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్మెంట్.
మరి నిజంగానే ఫామ్ లో లేరు కాబట్టి కెప్టెన్ గా ఆటలో విఫలమవుతున్నాడు కాబట్టే రోహిత్ శర్మను ( Rohit Sharma ) తొలగించారా? లేదా? అతనే తప్పుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి బయటకు వచ్చిన వార్తల ప్రకారం రోహిత్ శర్మ ప్రదర్శన బాగోలేకపోవడం వల్లనే కోచ్ గంభీర్…. కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించారని అంటున్నారు. సిడ్ని టెస్ట్ భారత్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు అవకాశం కోసం శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ కోసం అందరూ వెయిట్ చేయాలి. అక్కడ భారత్ కు అనుకూలమైన ఫలితాలు వస్తే డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం రోహిత్ శర్మ ( Rohit Sharma ) అందుబాటులో ఉంటాడు. లేదంటే సిడ్నీ టెస్ట్ తర్వాతనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: Chahal – Dhanushshree: అతనితో రిలేషన్.. భార్య ఫోటోలు డిలీట్ చేసిన చాహల్.. ఇక విడాకులే ?
ఇది ఇలా ఉండగా.. రోహిత్ శర్మ ప్రస్తుతం అధిక బరువుతో బాధపడుతున్నాడట. అతను బరువు తగ్గితే… ఫిట్నెస్ సంపాదిస్తాడని కొంతమంది క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ… సాధారణం కంటే 20 కేజీల వరకు ఎక్కువగా ఉన్నాడట. ఆ బరువు తగ్గితే కచ్చితంగా రోహిత్ శర్మ మళ్ళీ.. గతంలో ఆడినట్లు ఆడతాడు అని కొంతమంది అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా.. రోహిత్ శర్మ బరువు తగ్గాలని అంటున్నారు.