E-Paper
Advertisement

ఈ రెండు గ్యాడ్జెట్లు ఉంటే.. పాత ఏసీ కూడా స్మార్ట్‌గా మారిపోద్ది.. బోలెడంత పవర్ ఆదా!

ఈ రెండు గ్యాడ్జెట్లు ఉంటే.. పాత ఏసీ కూడా స్మార్ట్‌గా మారిపోద్ది.. బోలెడంత పవర్ ఆదా!
Advertisement

Smart AC Controller: జూన్ నెల వచ్చినా ఎండలు మండిపోతుండటంతో ఇళ్లలో, ఆఫీసుల్లో ఏసీల వాడకం ఇంకా కొనసాగుతోంది. అయితే ఏసీ సౌకర్యాన్ని వదులుకోలేక, బిల్లులను భరించలేక చాలా మంది సతమతమవుతున్నారు. అలాంటి వారికి టెక్నాలజీ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతోంది. ఒక స్మార్ట్ టెంపరేచర్ సెన్సార్, వై-ఫై రిమోట్ (స్మార్ట్ ఏసీ కంట్రోలర్)లను మీ పాత ఏసీకి జత చేయడం ద్వారా కరెంట్ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అవసరం లేనప్పుడు ఆటోమేటిక్ ఆఫ్!

సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసి నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి వేళ గది చాలా చల్లగా మారిపోతుంది. ఆ సమయంలో ఏసీని ఆపడమో లేదా టెంపరేచర్ పెంచడమో చేయాలి. కానీ నిద్రలో అది గమనించక పోవడం వల్ల ఏసీ అనవసరంగా రన్ అవుతూ కరెంట్ బిల్లును పెంచేస్తుంది. అదే స్మార్ట్ టెంపరేచర్ సెన్సార్ ఉంటే అది గదిలోని ఉష్ణోగ్రతను నిరంతరం గమనిస్తూ ఉంటుందని నిపుణులు అంటున్నారు. గది తగినంత చల్లగా అవ్వగానే కంప్రెసర్‌ను ఆటోమేటిక్‌గా కట్ ఆఫ్ చేస్తుందని పేర్కొంటున్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

వై-ఫై రిమోట్‌తో ఏసీ కంట్రోల్

Advertisement

చాలామంది ఆఫీసులకు లేదా బయటకు వెళ్లేటప్పుడు హడావుడిలో ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో వై-ఫై రిమోట్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లోని ఏసీని ఆఫ్ చేసే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. అలాగే మీరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఉండగానే ఏసీ ఆన్ చేసుకుంటే మీరు వచ్చేసరికి గది చల్లగా మారిపోతుంది.

ఇన్వర్టర్ ఏసీలా మారే పాత ఏసీలు

మీరు వాడేది పాత మోడల్ (నాన్-ఇన్వర్టర్) ఏసీ అయినా సరే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లను అమర్చడం ద్వారా అది ఇన్వర్టర్ ఏసీ లాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. రూమ్ టెంపరేచర్‌ను బట్టి ఈ సెన్సార్లు ఏసీ పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. దీనివల్ల కంప్రెసర్‌పై పడే లోడ్ తగ్గి, ఏసీ జీవితకాలం పెరగడమే కాకుండా 20% నుండి 30% వరకు కరెంట్ బిల్లు ఆదా అవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

Advertisement

Also Read: ఒకే ధర.. భిన్నమైన లాభాలు.. జియో, వీఐ రూ.3599 ప్లాన్లలో ఏది బెస్ట్?

టైమర్లు, షెడ్యూలింగ్ సౌకర్యం

ఈ వై-ఫై ఆధారిత సిస్టమ్స్ ద్వారా మీరు నిర్దిష్ట సమయాలకు ఏసీ ఆన్/ఆఫ్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రాత్రి 11 గంటలకు ఏసీ ఆన్ అయి, ఉదయం 5 గంటలకు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోయేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మార్కెట్లో మార్కెట్లో ఈ స్మార్ట్ వై-ఫై రిమోట్లు, సెన్సార్లు కేవలం రూ. 1,000 నుండి రూ. 2,500 లోపే లభిస్తున్నాయని తెలియజేస్తున్నారు. ఒక్కసారి ఈ చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే ప్రతి నెల వచ్చే వేల రూపాయల ఏసీ బిల్లుల నుండి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు.

Also Read: సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×