E-Paper
Advertisement

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!
Advertisement

Noise REP Fitness Band: టెక్ దిగ్గజం నాయిస్ మార్కెట్‌లోకి Noise REP పేరుతో ఒక ప్రత్యేకమైన ఫిట్‌నెస్ బ్యాండ్‌ను తీసుకొచ్చింది. సాధారణ స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా దీనికి ఎలాంటి డిస్‌ప్లే ఉండదు. డిస్ట్రాక్షన్స్ లేకుండా కేవలం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మాత్రమే శ్రద్ధ పెట్టాలనుకునే వారి కోసం దీనిని రూపొందించారు. ఇప్పుడీ బ్యాండ్ యొక్క ధర, ఫీచర్లు, పూర్తి వివరాలేమిటో తెలుసుకుందాం.

తేలికైన బాడీ, ఆకట్టుకునే డిజైన్:

ఇది కేవలం 27 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, సౌకర్యవంతమైన నైలాన్ స్ట్రాప్‌తో రోజంతా సులభంగా ధరించవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉండటంతో వర్కౌట్స్ చేసేటప్పుడు లేదా నీటి వాతావరణంలోనూ ధైర్యంగా వాడుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ యాప్‌తో హెల్త్ డేటా:

Advertisement

ఈ బ్యాండ్‌లో రోజంతా గుండె వేగం, ఆక్సిజన్ స్థాయిలు (SpO2), స్ట్రెస్ లెవెల్స్, బాడీ టెంపరేచర్, నిద్రను ఖచ్చితత్వంతో ట్రాక్ చేసే సెన్సార్లు ఉన్నాయి. దీనిలో డిస్‌ప్లే ఉండదు కాబట్టి.. సేకరించిన హెల్త్ డేటానంతా మన ఫోన్‌లోని నాయిస్ ఫిట్ (NoiseFit) యాప్‌లో వివరంగా చూసుకోవచ్చు.

Also Read: డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

సూపర్ బ్యాటరీ, ఎఐ ఫీచర్లు:

Advertisement

ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్ ద్వారా వాకింగ్, రన్నింగ్ వంటి 20కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది లెక్కిస్తుంది. ఎలాంటి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు లేకుండా ఉచితంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో హెల్త్ రిపోర్ట్స్ ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

ధర, ప్రత్యేక లాంచ్ ఆఫర్లు:

ఈ Noise REP Fitness Band అసలు ధర రూ.9,999 కాగా.. నాయిస్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉంది. అయితే రూ.999తో REP Pass తీసుకుంటే రూ.2,000 తగ్గింపు వస్తుంది. దీనికి తోడు HDFC బ్యాంక్ కార్డులపై మరో రూ.1,000 తగ్గింపుతో మొత్తంగా రూ.7,999కే ఈ బ్యాండును సొంతం చేసుకోవచ్చు. ఉచితంగా రూ.1,999 విలువైన స్ట్రాప్ కూడా లభిస్తుంది.

Also Read: రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×