E-Paper
Advertisement

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?
Advertisement

Smartphone Comparison: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం మార్కెట్లో మూడు ఫోన్లు ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా Samsung Galaxy F70 Pro 5Gను తీసుకురాగా.. దీనికి పోటీగా OnePlus N6, Poco M8 5G కూడా మంచి ఆప్షన్‌లుగా నిలిచాయి. మరి ఈ మూడు ఫోన్లలో మీ బడ్జెట్‌కు, మీ అవసరాలకు ఏది బాగా సరిపోతుంది? ఫీచర్లు, పనితీరు, కెమెరా, బ్యాటరీ, ధర వంటి అంశాల ఆధారంగా ఇప్పుడు ఒక్కో ఫోన్‌ను పోల్చి చూద్దాం.

ధరల విషయానికి వస్తే.. పోకో తక్కువ ధరకే లభిస్తోంది. Poco M8 5G ప్రారంభ వేరియంట్ ధర రూ.21,999 కాగా, OnePlus N6 ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. ఇక Samsung Galaxy F70 Pro కొద్దిగా ప్రీమియం కేటగిరీలో రూ.25,999 నుండి ప్రారంభమవుతుంది. మీ బడ్జెట్‌ను బట్టి ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

Advertisement

స్క్రీన్ క్వాలిటీ విషయంలో పోకో, శాంసంగ్‌లు ముందు వరుసలో ఉన్నాయి. Poco M8 5Gలో 3D కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు ఏకంగా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. శాంసంగ్‌లో కూడా అద్భుతమైన సూపర్‌ అమోలెడ్ స్క్రీన్ ఉంది. అయితే OnePlus N6లో కేవలం HD+ LCD స్క్రీన్ మాత్రమే ఉండటం కొంత నిరాశపరిచే అంశం.

Also Read: హానర్ నుంచి Robot Phone.. కెమెరానే గింబాల్‌లా తిరుగుతుంది, ఫీచర్లు చూశారా?

Advertisement

ఫోన్ స్పీడ్, గేమింగ్ విషయంలో శాంసంగ్, పోకో రెండూ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో సమానమైన పనితీరును అందిస్తాయి. OnePlus N6లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్ ఉంది. శాంసంగ్, వన్‌ప్లస్‌లు సరికొత్త ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో పనిచేస్తుండగా, పోకో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్‌పై నడుస్తుంది.

ఫొటోగ్రఫీ ప్రేమికులకు శాంసంగ్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీని వెనుక వైపు OIS ఫీచర్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. పోకోలో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కానీ అల్ట్రావైడ్ లేదు. ఇక సెల్ఫీల విషయానికి వస్తే.. పోకో 20 మెగాపిక్సెల్ కెమెరాతో మెరుగ్గా ఉంది.

బ్యాటరీ పరంగా OnePlus N6 అన్నటి కంటే చాలా ముందుంది. దీనిలో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందించారు. శాంసంగ్‌లో 6,000mAh, పోకోలో 5,520mAh బ్యాటరీలు ఉన్నాయి. ఈ మూడు ఫోన్లు కూడా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. మొత్తానికి డిస్‌ప్లే, కెమెరా కావాలో లేక భారీ బ్యాటరీ కావాలో నిర్ణయించుకుని మీకు నచ్చిన ఫోన్‌ను ఎంచుకోవచ్చు.

Also Read: వాట్సప్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు.. ఫోన్ స్టోరేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్!

Related News

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

మళ్లీ వివాదంలో టెలిగ్రామ్.. ఈసారి యాపిల్ స్టోర్ నుంచి అవుట్.. అసలేం జరుగుతోంది!

వాట్సప్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు.. ఫోన్ స్టోరేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్!

ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!

హానర్ నుంచి Robot Phone.. కెమెరానే గింబాల్‌లా తిరుగుతుంది, ఫీచర్లు చూశారా?

ఇది కలా? నిజమా?.. కళ్లు లేకపోయినా చూడొచ్చట.. మస్క్ కొత్త ‘చిప్’ మాయాజాలం!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఫోన్‌పై ఏకంగా రూ.17,000 డిస్కౌంట్.. గోల్డెన్ ఛాన్స్ వదులుకోకు భయ్యా!

Big Stories

Advertisement
×