E-Paper
Advertisement

నిస్సాన్ బేబీ పెట్రోల్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటాకు ఇక చుక్కలేనా?

నిస్సాన్ బేబీ పెట్రోల్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటాకు ఇక చుక్కలేనా?
Advertisement

Nissan Baby Patrol SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లో పోటీని మరింత పెంచేందుకు నిస్సాన్ కొత్త మిడ్‌ సైజ్ SUVని తీసుకురాబోతోంది. టెక్టన్ పేరుతో రానున్న ఈ SUVని జూలై 9న ముంబైలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఇప్పటికే కంపెనీ విడుదల చేసిన టీజర్లతో ఈ కారుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ కొత్త SUVని నిస్సాన్ అధికారికంగా బేబీ పెట్రోల్ అని పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నిస్సాన్ పెట్రోల్ SUV నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌ తో ఈ మోడల్ రెడీ అయినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది ప్రీమియం లుక్‌ తో పాటు బలమైన రోడ్డు ప్రెజెన్స్‌ ను కలిగి ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఆకట్టుకుంటున్న తాజా టీజర్

తాజా టీజర్‌ లో టెక్టన్ SUVని నిస్సాన్ పెట్రోల్ పక్కన చూపించారు. దీంతో రెండు వాహనాల మధ్య డిజైన్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఎత్తైన బాడీ డిజైన్, విశాలమైన ఆకృతి, పూర్తి వెడల్పుతో ఉండే LED లైట్ బార్ లాంటి అంశాలు ఈ SUVకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముందుభాగంలో ఆకట్టుకునే నిస్సాన్ లోగో కూడా ఉండే అవకాశం ఉంది.

డిజైన్ గురించి..

Advertisement

టెక్టన్ బాక్సీ SUV స్టైల్‌ ను కలిగి ఉంటుంది. నిలువుగా ఉండే రూఫ్‌ లైన్, బలమైన వీల్ ఆర్చ్‌లు, మందమైన బాడీ క్లాడింగ్, మస్కులర్ లుక్ ఈ కారుకు రగ్గడ్ లుక్ ను ఇవ్వనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌ వ్యాగన్ టైగన్ లాంటి SUVలకు ఇది గట్టి పోటీగా నిలవనుంది.

ఫీచర్ల గురించి..

ఈ మోడల్ లో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ SUVలో డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. భద్రత పరంగా కూడా అత్యాధునిక సదుపాయాలను అందించనుంది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, ADAS లాంటి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు తీసుకురావచ్చని తెలుస్తోంది.

ఇంజిన్ గురించి..

Advertisement

ఈ SUV కొత్త రెనాల్ట్ డస్టర్‌ తో కొన్ని పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లను పంచుకునే అవకాశం ఉంది. బేసిక్ వేరియంట్లలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు. ఇది సుమారు 100 PS శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. టాప్ వేరియంట్లలో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 163 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×