E-Paper
Advertisement

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!
Advertisement

Apple Camera AirPods: యాపిల్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈసారి సౌండ్ మాత్రమే కాకుండా.. మన కంటికి కనిపించే ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకునేలా ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేసే పనిలో పడింది. సాధారణంగా కేవలం పాటలు వినడానికి, ఫోన్ మాట్లాడటానికి వాడే ఈ ఇయర్‌ఫోన్స్‌లో కెమెరాలను అమర్చి, సరికొత్త వేరబుల్ టెక్నాలజీని పరిచయం చేయడానికి సంస్థ సిద్ధమవుతోంది.

రెండు విభిన్న మోడళ్లపై ప్రయోగాలు:

యాపిల్ ప్రస్తుతం అంతర్గతంగా B790, B798 అనే కోడ్ పేర్లతో రెండు రకాల కెమెరా ఎయిర్‌పాడ్స్ మోడళ్లను పరీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో B790 మోడల్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఐవోఎస్ కోడింగ్‌లో కూడా దీనికి సంబంధించిన వివరాలు కనిపించడంతో, అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే ఐఫోన్లతో పాటు సెప్టెంబర్‌లోనే ఇవి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో మోడల్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు.

Advertisement

Also Read: రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

విజువల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు:

ఈ ఎయిర్‌పాడ్స్ కేవలం ఫొటోలు తీయడానికి కాకుండా, మన చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. చెవులకు పెట్టుకున్నప్పుడు ఇరువైపులా ఉండే చిన్న కెమెరాలు మన ముందర ఉన్న వస్తువులను, ప్రముఖ ప్రాంతాలను, లేదా పేపర్‌పై ఉన్న అక్షరాలను గుర్తించి సమాచారాన్ని అందిస్తాయి. ఉదా: మనం చూసే కూరగాయలను బట్టి ఏ వంటకం చేయాలో కూడా Siri మనకు సలహా ఇస్తుంది.

కొత్తగా డిజైన్, మార్కెట్ అంచనాలు:

Advertisement

కెమెరా హార్డ్‌వేర్ అమర్చడం కోసం ఈ ఎయిర్‌పాడ్స్ పొడవు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే డేటా ప్రాసెస్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఎల్ఈడీ లైట్ వెలిగేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పాడ్స్ కంటే వీటి తయారీ ఖర్చు, ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. యాపిల్ వీటిని సాధారణ ప్రాక్సిరీస్ కాకుండా AirPods Ultra పేరుతో విడుదల చేసే ఆలోచనలో ఉంది.

Also Read: 8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×