E-Paper
Advertisement

52 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ..సురేష్ రైనా 12 ఏళ్ల రికార్డు బద్దలు

52 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ..సురేష్ రైనా 12 ఏళ్ల రికార్డు బద్దలు
Advertisement

Vaibhav Sooryavanshi Double Century:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో ( Asia Cup Rising Stars 2026) భాగంగా యూఏఈతో జరుగుతున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ (Vaibhav Sooryavanshi Double Century) చేసి.. యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇన్నింగ్స్ లో 53 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 204 పరుగులు సాధించి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలోనే 28 సిక్సర్లు, 7 బౌండరీలు సాధించాడు. 392.31 స్ట్రయిక్ రేట్ తో చుక్కలు చూపించాడు. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బాసిల్ హమీద్ బౌలింగ్ లో ఆర్యాన్ష్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక అంతకు ముందు 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ, 28 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డబుల్ సెంచరీని 52 బంతుల్లో పూర్తి చేసుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు.

సురేష్ రైనా 12 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

యూఏఈపై డబుల్ సెంచరీ నమోదు చేసుకున్న వైభవ్ సూర్యవంశీ, సురేష్ రైనా 12 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో పంజాబ్ కింగ్స్ జట్టుపై 25 బంతుల్లో సురేష్ రైనా 87 పరుగులు సాధించాడు. ఇందులో 12 బౌండరీలు, 6 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఆ రికార్డును తాజాగా యూఏఈపై 24 బంతుల్లో 88 పరుగులు సాధించి, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) బ్రేక్ చేశాడు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

యూఏఈపై టీమిండియా విక్టరీ.. సెమీస్ లోకి గ్రాండ్ ఎంట్రీ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా యూఏఈ జరిగిన మ్యాచ్ లో టీమిండియా జూనియర్స్ సూపర్ విక్టరీ అందుకున్నారు. యూఏఈపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్ లో యూఏఈ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 50 ఓవర్లు ఆడిన యూఏఈ 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవవర్లలోనే 3 వికెట్ల నష్టానికి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన తరుణంలోనే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో టీమిండియా సెమీస్ కు కూడా దూసుకెళ్లింది. గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో పాకిస్తాన్ గెలిస్తే, బంగ్లాదేశ్ తో రెండో సెమీస్ ఉండనుంది. పాకిస్తాన్ ఓడిపోతే, బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో సెమీస్ ఉంటుంది. లేకపోతే లంకతో టీమిండియా ఆడాల్సి వస్తుంది.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

 

 

Related News

28 బంతుల్లో వైభవ్ సెంచరీ..14 సిక్సర్లతో తాండవం, వన్డేల్లో వేగంగా శతకాలు చేసిన వీరులు వీళ్లే

టీమిండియా కుప్పకూల్చిన మాట్ హెన్రీపై పాకిస్తాన్ కోట్ల వ‌ర్షం..ఏకంగా PKR 7.07 crore

కావ్య పాప రిసెప్ష‌న్ లో మెరిసిన‌ ముత్తయ్య మురళీధరన్ భార్య..హీరోయిన్ ను మించిపోయిందిగా

టీమిండియాపై కొట్టిన ప్ర‌తీ బౌండ‌రీ,సిక్స‌రుకు 100 పాకిస్తానీ రుపాయలు

హైద‌రాబాద్ బిర్యానీ ఆశ‌చూపి ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారు..అంబ‌టి రాయులు సంచ‌ల‌నం!

గుడ్డిగా బ్యాట్ ఊపే వైభ‌వ్..వ‌న్డేల‌కు ప‌నికిరాడు, TRP కోస‌మే వాడిని ఆడిస్తున్నారు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌కు నీకు బుర్ర ఉందా..తోటి ప్లేయ‌ర్ల‌ను మీడియా ముందు అవ‌మానిస్తావా?

Big Stories

Advertisement
×