BigTV English

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Disable Slow Charging : ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ ఫోన్ లేకుండా ఒక్క రోజు కూడా గడపలేం. అదే సమయంలో ఆ స్మార్ట్​ ఫోన్‌కు ఏదైనా అయితే విలవిలలాడిపోతాం. ముఖ్యంగా ఫోన్‌ అంతా బానే ఉన్నప్పటికీ ఛార్జింగ్‌ అయిపోయినా, ఒకవేళ అది సరిగ్గా ఎక్కకపోయినా టెన్షన్‌ పడుతుంటాం. ఎందుకంటే ఆ స్మార్ట్ ఫోన్​తోనే బోలెడు పని చేయాల్సి ఉంటుంది.


అందుకే ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నామంటే తప్పనిసరిగా దాని బ్యాటరీ సామర్థ్యం ఎంత? ఎంత వేగంగా ఛార్జ్‌ అవుతుందనేది కూడా పరిశీలిస్తాం. ఒకప్పుడు 10 వాట్‌ ఛార్జింగ్‌తో మొదలైన ప్రయాణం ఆ తర్వాత 33 వాట్‌, 65 వాట్‌ అంటూ ప్రస్తుతం 90 వాట్‌, 100 వాట్, 120 వాట్స్‌ అంతా కన్నా ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్‌ వరకు చేరింది.

అయితే ఛార్జర్ ఎన్ని వాట్స్​తో కూడినది అయినా, బ్రాండెడ్​ ది అయినా, కొన్ని సందర్భాల్లో ఫోన్ ఛార్జ్​కు సహకరించకపోవడం, ఛార్జ్ ఎక్కడం ఆగిపోవడం వంటివి జరుగుతూనే ఉంటాయి. అప్పుడు వెంటనే సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లడం, రిపేర్ షాపునకు వెళ్లడం చేస్తుంటాం. అయితే అంతకన్నా ముందు కొన్ని సింపుల్​ ట్రిక్స్‌ పాటించాలని అంటున్నారు టెక్ వర్గాలు. అప్పుడు ఛార్జింగ్‌ అయ్యే అవకాశం ఉంటుందట.


20 నుంచి 30 శాతం మధ్య ఉన్నప్పుడే 

చాలా మంది ఫోన్ బ్యాటరీ పూర్తిగా జీరో అయిన తర్వాత కూడా ఛార్జ్‌ చేస్తుంటారు. అలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నాయి టెక్ వర్గాలు.

బ్యాటరీ ఛార్జింగ్ 20 నుంచి 30 శాతం మధ్య ఉన్నప్పుడే ఛార్జ్‌ చేయడం మంచిదట. అంతకన్నా తక్కువ అయిన తర్వాత ఛార్జ్‌ చేస్తే అది బ్యాటరీ జీవితకాలంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందట.

పాటించాల్సిన టిప్స్​ – మొదట స్మార్ట్‌ ఫోన్ కవర్‌ను తీసేసి, ఫోన్‌ను ఛార్జ్ చేయాలి. ఫోన్ కవర్ ఛార్జింగ్ పోర్ట్ చుట్టూ క్లీన్ చేయాలి. దాని చూట్టూ అడ్డంకులు ఏమైనా ఉంటే వాటిని తొలిగించాలి. ఎందుకంటే వాటి వల్లే కొన్ని సార్లు ఛార్జింగ్ కేబుల్స్ సరిగ్గా కనెక్ట్ కావు.

కొన్ని సందర్భాల్లో ఛార్జింగ్ పోర్ట్​ దుమ్ము లేదా ధూళితో మూసుకుపోతుంది. అప్పుడు ప్లాస్టిక్ టూత్‌పిక్ లేదా కంప్రెస్డ్ ఎయిర్​తో శుభ్రం చేయాలి. ఫోన్‌ను రీస్టార్ట్ చేసి కూడా చూడాలి.

ఒక్కోసారి ఛార్జింగ్ పోర్ట్‌లో తేమ ఉన్నా కూడా ఛార్జ్​ అవ్వదు. అందుకే తేమను తొలగించిన తర్వాత ఛార్జింగ్ చేయడానికి ప్రయత్నించాలి.

ఒకవేళ స్మార్ట్‌ఫోన్ వేడెక్కినా కూడా బ్యాటరీ ఛార్జ్‌ అవ్వదు. అలాంటి సమయంలో ఫోన్‌ను చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఆ తర్వాత మళ్లీ ఛార్జ్ చేయాలి.

స్మార్ట్‌ ఫోన్ కేబుల్ దెబ్బతిన్నా కూడా ఛార్జింగ్ ఎక్కదు. కాబట్టి మరో ఛార్జర్ లేదా కేబుల్‌తో ఛార్జ్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు కొత్త ఛార్జర్ లేదా కేబుల్‌ను తీసుకోవాలి.

అలానే ప్లగ్ లేదా సాకెట్‌తో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. అందులో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫోన్ ఛార్జ్ కాదు. చివరగా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫోన్ ఛార్జ్ కాకపోతే సర్వీస్‌ సెంటర్‌కు ఫోన్​ను తీసుకెళ్లాలి.

ALSO READ : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Related News

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Big Stories

×