E-Paper
Advertisement

మోసపోకండి ఇలా బతకండి..సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి 5 మార్గాలు

మోసపోకండి ఇలా బతకండి..సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి 5 మార్గాలు
Advertisement

Cyber Crime Prevention:  రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక చిన్న ఫోన్ కాల్ లేదా లింక్ ద్వారా బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే కొద్ది పాటి అప్రమత్తతతో ఈ సైబర్ మోసాల బారిన పడకుండా ఉండొచ్చు. డిజిటల్ ప్రపంచంలో.. మనల్ని మనం కాపాడుకోవడానికి, మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు.. సహాయపడే 5 అత్యంత ఈజీ.. ప్రభావవంతమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. తెలియని లింక్స్, యాప్స్‌:

చాలా మందికి మెసేజ్‌లలో “మీకు లాటరీ తగిలింది”, “ఫ్రీ గిఫ్ట్ వచ్చింది” లేదా “కేవైసీ అప్‌డేట్ చేయండి” అంటూ ఫేక్ లింక్స్ వస్తుంటాయి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే థర్డ్-పార్టీ యాప్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. మీరు క్లిక్ చేసిన క్షణంలోనే మీ ఫోన్‌లోని డేటా హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. నమ్మకమైన అధికారిక యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

2. ఓటీపీ, పాస్‌వర్డ్‌:

Advertisement

బ్యాంకు అధికారులు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు లేదా పోలీసుల పేరుతో ఫోన్ చేసి ఓటీపీ, యూపీఐ పిన్ లేదా పాస్‌వర్డ్‌లు అడుగుతుంటారు. గుర్తుంచుకోండి, ఏ బ్యాంక్ అధికారిక సిబ్బంది కూడా మీ పర్సల్ పాస్‌వర్డ్‌లను లేదా ఓటీపీని ఫోన్ ద్వారా అడగరు. మీ సమాచారాన్ని ఎవరితోనూ పంచు కోకపోవడమే సైబర్ నేరాల నుంచి రక్షణకు మొదటి మెట్టు.

3. పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్:

మీ ఈమెయిల్, సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంకింగ్ యాప్స్‌కు ఒకే రకమైన ఈజీ పాస్‌వర్డ్‌లను వాడకండి. అక్షరాలు,నంబర్స్, ప్రత్యేక గుర్తులు కలిగిన బలమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోండి. అలాగే మీ ముఖ్యమైన అకౌంట్లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ లాక్‌ను ఎనేబుల్ చేసుకొని మరింత సేఫ్‌గా ఉండండి.

Advertisement

Also Read:  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్‌లు!

4. పబ్లిక్ వైఫై :

రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మాల్స్ , హోటల్స్‌లో లభించే ఫ్రీ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం అసలు వాడకండి. పబ్లిక్ వైఫై ద్వారా హ్యాకర్లు మీ ఫోన్ లేదా లాప్‌ టాప్‌లోకి ఈజీగా హ్యాక్ చేసి డేటాను దొంగిలించే అవకాశం ఉంది. అత్యవసరమైతే మీ మొబైల్ డేటాను మాత్రమే ఉపయోగించడం సురక్షితం.

5. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం:

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై మీ ఫోన్ నంబర్, పుట్టినరోజు, ఇంటి చిరునామా, ఆధార్ వివరాలు వంటి పర్సనల్ విషయాలు బహిరంగంగా పోస్ట్ చేయకండి. సైబర్ నేరగాళ్లు ఈ సమాచారాన్ని సేకరించి మీ పేరుతో నకిలీ అకౌంట్ తయారు చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవసీ సెట్టింగ్స్‌ను స్ట్రిక్ట్‌గా ఉంచుకోండి.

సైబర్ మోసాలు జరగకుండా ఉండటానికి.. మన అప్రమత్తతే చాలా ముఖ్యం. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే.. సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా మన కష్టార్జితాన్ని కాపాడుకునేలా చేస్తాయి. ఏదైనా మోసం జరిగితే .. వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

Related News

వాట్సాప్ యూజర్లకు షట్‌డౌన్ వార్నింగ్స్..అసలు కారణాలివేనట!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్‌లు!

మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×