E-Paper
Advertisement

రోడ్ల భద్రతపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆ స్వీడన్ మోడల్ కావాల్సిందే!

రోడ్ల భద్రతపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆ స్వీడన్ మోడల్ కావాల్సిందే!
Advertisement

Venkat Reddy: స్వేచ్ఛ బ్యూరో : రాష్ట్రంలో సురక్షిత రహదారుల నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గుజరాత్ రాష్ట్రం నర్మద జిల్లాలోని ఎక్తానగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో జరుగుతున్న చింతన్ శివిర్ రెండో రోజు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ‘సురక్షిత రహదారుల రూపకల్పన-ప్రమాణాల నుంచి అమలు వరకు’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్‌కు అధ్యక్షత వహించారు.

మంత్రి మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణానికి ప్రమాణాలు రూపొందించడమే కాదని, క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారుల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించేందుకు కేంద్ర, రాష్​ట్ర ప్రభుత్వాల సమష్టి కృషి అవసరమన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడం కాదని, శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపాలని సూచించారు. డిజైన్‌ నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూసేకరణ, రైట్ ఆఫ్ వే రహదారి భద్రతలో కీలక అంశాలని వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళనకరమని, 6+2 లేన్ విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

రహదారి భద్రతలో ‘విజన్ జీరో’ విధానం

Advertisement

రోడ్డు భద్రత ఆడిట్లు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. అంతర్జాతీయ అనుభవాల నుంచి నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తాను పలు దేశాల్లో పర్యటించి రహదారి భద్రతకు సంబంధించిన అనేక ఉత్తమ విధానాలను పరిశీలించానని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు రోడ్డు భద్రతను కేవలం ఇంజినీరింగ్ అంశంగా కాకుండా ప్రత్యేక వృత్తిపరమైన విభాగంగా పరిగణిస్తున్నాయని చెప్పారు. స్వీడన్‌ అమలుచేస్తున్న ‘విజన్‌ జీరో’ విధానం నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. రహదారిపై ఒక్క మరణం లేదా తీవ్ర గాయం కూడా ఆమోదయోగ్యం కాదన్న ఆలోచనను భారత పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read: ఆడవాళ్లపై ఇంత నీచ రాజకీయమా? కేటీఆర్.. ఇదేనా మీ సంస్కారం?!

Tags

Related News

అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్

ఆడవాళ్లపై ఇంత నీచ రాజకీయమా? కేటీఆర్.. ఇదేనా మీ సంస్కారం?!

కర్త, కర్మ, క్రియ ఆయనే.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై నిజాలు బయటపెట్టిన కవిత

 వరంగల్ జిల్లాలో విషాదం.. పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి దుర్మరణం!

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

Big Stories

Advertisement
×