Gautam Gambhir VS Shreyas Iyer: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇండోర్ వేదికగా జరిగిన మూడవ టి20 సందర్భంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. గౌతమ్ గంభీర్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇచ్చిన సూచనలను శ్రేయస్ అయ్యర్ ముఖం మీదే రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ తన ఆదేశాలు పాటించాల్సిందేనని గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని అంటున్నారు. నమన్ ధీర్ కు బౌలింగ్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడట. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ అస్సలు వినలేదట. కానీ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బలవంతంగా అతడి ఆదేశాలను పాటించాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇండోర్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ సేన బిగ్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మూడవ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న కసితో టీమిండియా ప్లేయర్లు. దానికి తగ్గట్టుగానే గౌతమ్ గంభీర్ ప్రతి ఓవర్ ను దగ్గరుండి వేయించాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ మధ్య డ్రింక్స్ బ్రేక్ సమయంలో గొడవ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. కమిల్ పూరన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో నమన్ ధీర్ తో బౌలింగ్ చేయించాలని గౌతమ్ గంభీర్ సూచనలు చేశాడట. అయితే దీన్ని శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ధీర్ బౌలింగ్ లో పురాన్ భారీ షాట్లు ఆడతాడు అని వెల్లడించాడట. సిక్సర్ల పైన సిక్సర్లు వెళ్తాయని గౌతమ్ గంభీర్ ముఖం మీదే చెప్పినట్టు సమాచారం.
అయితే, రెండు సిక్సర్లు కొడితే కొట్టవచ్చు… కానీ ఆ తర్వాత మాత్రం కచ్చితంగా నమన్ ధీర్ బౌలింగ్ లో కమిల్ పురాన్ ఔట్ కావడం గ్యారెంటీ అని గంభీర్ వెల్లడించాడట. అందుకే నమన్ ధీర్ తోనే వెళ్దామని ప్లాన్ చెక్ చేసినట్టు తెలుస్తోంది. ఇక తనకు ఇష్టం లేకుండా నమన్ ధీర్ ను శ్రేయస్ అయ్యర్ కొనసాగించాడు. ఈ క్రమంలో పురాన్ ను 42 పరుగుల వద్ద నమన్ ధీర్ క్యాచ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా ఇండోర్ వేదికగా జరిగిన ఈ మూడవ మ్యాచ్ లో 20 ఓవర్లు ఆడిన టీమిండియా 223 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫలమైన వెస్టిండీస్ 209 పరుగులు చేసి, 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.