E-Paper
Advertisement

యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!

యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!
Advertisement

Data Transfer: ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి మారాలని చాలామందికి ట్రై చేస్తుంటారు. కానీ, పాత ఫోన్‌లోని ఫొటోలు, కాంటాక్ట్స్, పాస్‌వర్డ్‌లు.. ఇలా సమస్తం కొత్త దాంట్లోకి మార్చుకోవడమే అసలైన సర్కస్ ఫీట్. అందుకే సగం మంది ఆ ఆలోచననే పక్కన పెట్టేస్తుంటారు. అయితే, ఐఫోన్ యూజర్ల ఈ తలనొప్పికి గూగుల్ ఈసారి చెక్ పెట్టింది. అవును మీరు విన్నది నిజమే.. ఒక్క క్లిక్‌తో ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి సెకండ్లలో డేటా షేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏం మార్చబోతున్నారు?

ఆండ్రాయిడ్ 17 వెర్షన్‌లో గూగుల్ ఒక సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై ఐఫోన్ నుంచి డేటాను ఆండ్రాయిడ్‌కు బదిలీ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త ఫోన్ ఆన్ చేసి సెటప్ చేసుకునే సమయంలోనే, ఐఫోన్ లోని ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, క్యాలెండర్ ఈవెంట్స్, సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు, వైఫై సమాచారం, చివరికి ఈ-సిమ్ (eSIM) వివరాలను కూడా చాలా సులువుగా వైర్‌లెస్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఇంత తక్కువ ధరకే అలాంటి ఫీచర్లా? 144Hz OLED డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో Asus Pad T3201!

ఎలా పనిచేస్తుంది?

ఈ డేటా ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ సెటప్ చేసేటప్పుడు Copy Data From Iphone అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోగానే స్క్రీన్‌పై ఒక QR కోడ్ వస్తుంది. మీ పాత ఐఫోన్‌తో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. రెండు ఫోన్ల మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మీకు కావలసిన డేటాను ఎంచుకుని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉంటాయి.

వాట్సప్, మెసేజింగ్ సమస్యలకు చెక్:

Advertisement

చాలామంది ఐఫోన్ నుంచి మారడానికి భయపడేది వాట్సప్ చాట్‌లు, మెసేజ్‌ల కోసమే. ఈ కొత్త అప్‌డేట్‌తో వాట్సప్ చాట్‌లను కూడా సులభంగా ఆండ్రాయిడ్‌లోకి మార్చుకోవచ్చు. అలాగే ఐక్లౌడ్‌లోని ఫొటోలను గూగుల్ ఫొటోస్‌కి మార్చుకోవడానికి, ఐమెసేజ్ స్థానంలో గూగుల్ మెసేజెస్ వాడటానికి గూగుల్ స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది.

అందుబాటులోకి వచ్చిందా?

ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 17తో వచ్చే ఎంపిక చేసిన పిక్సెల్ ఫోన్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్లలోకి కూడా రానుంది. డేటా ట్రాన్స్‌ఫర్‌తో పాటు ఆండ్రాయిడ్ 17లో మెరుగైన సెక్యూరిటీ, డెస్క్‌టాప్ మోడ్, జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి మరిన్ని అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: యూజర్లు నిద్రపోతున్నా బ్యాగ్రౌండ్‌లో వర్క్ కంప్లీట్ చేసే Google Gemini Spark.. భారత్‌లో లాంచ్!

Related News

ఇల్లు తళతళా మెరవాలంటే..ఈ వాక్యూమ్ క్లీనర్లు ఉండాల్సిందే!

రూ.5 వేల బడ్జెట్‌లో ఇంతకంటే ఏం కావాలి? మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త వాచ్!

ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!

ఫోన్ నెట్‌వర్క్ పదేపదే మారుతోందా?ఈ సమస్యకు పక్కా పరిష్కారం ఇదిగో!

రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?

రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..గ్రూప్ చాట్ కోసం 4 కొత్త ఫీచర్లు విడుదల!

ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

Big Stories

Advertisement
×