E-Paper
Advertisement

బిల్ గేట్స్ హెచ్చరించిన మరుసటి రోజే.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్.. 60 వేల మందికి బైఅవుట్ ఆఫర్!

బిల్ గేట్స్ హెచ్చరించిన మరుసటి రోజే.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్.. 60 వేల మందికి బైఅవుట్ ఆఫర్!
Advertisement

Microsoft Buyout: బిల్ గేట్స్ హెచ్చరించిన మరుసటి రోజే మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ (బైఅవుట్) ఆఫర్‌ను ప్రకటించి ప్రపంచ టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే ముప్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ కంపెనీల ప్రోత్సాహకాల విధానం తప్పుగా ఉందన్న ఆయన.. రోబోను ఉద్యోగంలోకి తీసుకొని మనుషులను తీసేయడం సరైన పద్దతి కాదని అభిప్రాయపడ్డారు.

ఏఐని సాంకేతిక రంగంలో వచ్చిన ఒక పరిణామ క్రమంగా బిల్ గేట్స్ అభివర్ణించారు. భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలతో పాటు బ్లూ కాలర్ జాబ్స్ ను సైతం ఏఐ భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగాలు తగ్గితే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గి.. ప్రభుత్వాల వద్ద ప్రజా సంక్షేమ నిధులు క్షీణిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారని ఈ సందర్భంగా బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు వెలువడిన మరుసటి రోజే మైక్రోసాఫ్ట్ తన వద్ద పనిచేస్తున్న 2,50,000 మంది ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందికి (60,000 మంది) బైఅవుట్ ఆఫర్ ఇవ్వడం సంచలనం సృష్టించింది.

Advertisement

అమెరికా, కెనడా, బ్రిటన్‌తో పాటు భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సంస్థలోని ‘లెవెల్ 70’, అంతకంటే తక్కువ కేడర్‌లలో ఉన్న ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు. దీని పరిధిలోకి వైస్ ప్రెసిడెంట్ స్థాయి అధికారుల వరకు కూడా రానున్నారు. డిసెంబర్ వరకు బైఅవుట్ ఆఫర్ కు గడువు ఇవ్వగా.. దీనికి అంగీకరించిన వారు ఈ ఏడాది చివరి నాటికి సంస్థ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది.

స్వచ్ఛంద విరమణకు సిద్ధపడే ఉద్యోగులకు వారి సీనియారిటీ ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. ‘లెవెల్ 64′, అంతకంటే తక్కువ స్థాయి ఉన్నవారికి ప్రతి ఆరు నెలల సర్వీసుకు ఒక వారం జీతం చొప్పున ’65 నుండి 67’ లెవెల్ ఉద్యోగులకు రెండు వారాల జీతం చొప్పున పరిహారం ఇస్తారు. దీనికి అదనంగా 6 నుండి 12 నెలల స్టాక్ వెస్టింగ్, కొంతకాలం పాటు హెల్త్‌కేర్ కవరేజ్, కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలో సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం ఏఐ వల్ల కాదని మైక్రోసాఫ్ట్ పేర్కొంటున్నప్పటికీ.. ఏఐపై చేస్తున్న భారీ పెట్టుబడుల కోసమే ఈ ఖర్చుల కోత అని పరిశ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Also Read: టోల్ ప్లాజా సమీపంలో నివసిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్!

అయితే ఈ పరిణామాలు పాశ్చాత్య దేశాలకే కాకుండా.. భారత్ లాంటి ఐటీ ఉద్యోగ శక్తి కలిగిన దేశాలకు పెద్ద హెచ్చరికగా పరిణమిస్తోంది. ఓవైపు ఏఐ పురోగతి వల్ల ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ.. ఆదాయ అసమానతలు కూడా పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇప్పటికే హెచ్చరించింది. బహుళజాతి సంస్థలు సాంకేతికత వైపు వేగంగా పరుగులు తీస్తున్న వేళ.. శ్రామిక శక్తిని కాపాడుకోవడం, కొత్త నైపుణ్యాల వైపు వారిని మళ్లించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారనుంది.

Also Read: రూ.40ల పెరుగు కోసం ఆశపడితే.. ఏకంగా రూ.98,000 పోయాయ్.. కస్టమర్ కేర్ పేరుతో దారుణ మోసం!

Tags

Related News

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. ఒకేసారి రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు వచ్చే వడ్డీ ఎంత?

జియో లిస్టింగ్ అదుర్స్.. అనంత్ స్పీచ్ తో రిలయన్స్ అధినేత ముకేష్ కంటతడి

ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!

ఆఫీస్, షాపు లేకుండానే ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు.. ఈ GST నిబంధన గురించి తెలుసా?

పాలు, పండ్లు, కూరగాయలు ఏదైనా 5 స్టార్ హోటల్స్‌కు నేరుగా విక్రయించండి.. రైతులకు మంచి అవకాశం

హోమ్ లోన్ టెన్యూర్ ఎంత ఉండాలి? తక్కువ ఈఎంఐ బెటరా? త్వరగా తీర్చేయడం మంచిదా?

దీపావళి వేళ గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆభరణాలు కొనకుండానే.. పసిడిపై లాభాలు పొందే 5 మార్గాలు!

ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. దీపావళి కానుకగా కార్లు అందజేత.. ఈ కంపెనీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే!

Big Stories

Advertisement
×