E-Paper
Advertisement

పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? ఈ 5 స్టెప్స్‌తో కార్ సెక్యూరిటీ కెమెరాగా మార్చేయండి!

పాత ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? ఈ 5 స్టెప్స్‌తో కార్ సెక్యూరిటీ కెమెరాగా మార్చేయండి!
Advertisement

Car Dashcam: ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన పాత ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఉందా? అయితే దానికి కార్లలో వాడే డ్యాష్‌క్యామ్‌గా కొత్త రూపం ఇవ్వొచ్చు. మార్కెట్లో వేల రూపాయలు పెట్టి కొత్త డ్యాష్‌క్యామ్ కొనే బదులు.. మన పాత ఫోన్‌తోనే ఉచితంగా ఈ పని పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి:

పాత ఫోన్లను కారు డ్యాష్‌క్యామ్‌గా మార్చడానికి ఒక ఫోన్ హోల్డర్, ఛార్జింగ్ కేబుల్ ఉంటే చాలు. అయితే.. డ్యాష్‌క్యామ్‌గా మార్చాలనుకున్న ఫోన్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే ముందుగా దానిలో ఉన్న డేటాను బ్యాకప్ చేసుకుని, ఫోన్‌ను పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. సోషల్ మీడియా యాప్స్‌ను డిసేబుల్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్‌లో ‘డూ నాట్ డిస్టర్బ్’ మోడ్ ఆన్ చేయడం వల్ల రికార్డింగ్ మధ్యలో ఎలాంటి ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌ల రావు.

యాప్‌ ఇన్‌స్టాలేషన్:

Advertisement

ఫోన్ నార్మల్ కెమెరాతో కాకుండా ప్లే స్టోర్ నుండి ‘డ్రాయిడ్ డ్యాష్‌క్యామ్’ లాంటి ఉచిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది లూప్ రికార్డింగ్, జీపీఎస్, టైమ్‌స్టాంప్ వంటి ఫీచర్లను అందిస్తుంది. రికార్డింగ్ క్వాలిటీని 1080pకి సెట్ చేయడం వల్ల ఫోన్ మెమరీ కలిసి రావడమే కాకుండా.. ఫోన్ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది. కొంతమంది డ్రైవ్‌సైట్ లాంటి ఏఐ యాప్స్ వాడుతుంటారు, కానీ దానికి నెలకు దాదాపు రూ.400 ఖర్చవుతుంది. కాబట్టి ఉచిత యాప్స్ వాడటమే మంచిది.

Also Read: లాంచ్ స్ట్రాటజీ మార్చిన Huawei.. కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న యూజర్లకు గుడ్ న్యూస్, కానీ..

లూప్ రికార్డింగ్‌ను ఎంచుకోవాలి:

Advertisement

డ్యాష్‌క్యామ్ యాప్‌లో లూప్ రికార్డింగ్ ఆప్షన్ చాలా ముఖ్యం. ఇది ఆన్ చేయడం వల్ల ఫోన్ మెమరీ నిండిపోయినప్పుడు, పాత వీడియోలను ఆటోమేటిక్‌గా డిలీట్ చేసి కొత్త వీడియోలను రికార్డ్ చేస్తుంది. దీనివల్ల స్టోరేజ్ ఫుల్ అనే సమస్యే రాదు. అలాగే వీడియోలను ఒకే పెద్ద ఫైల్‌గా కాకుండా, ఐదు నిమిషాల చిన్న చిన్న క్లిప్స్‌గా సేవ్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోండి. దీనివల్ల అవసరమైనప్పుడు క్లిప్స్‌ను షేర్ చేయడం సులువవుతుంది.

సెట్టింగ్స్‌ను ఇలా మార్చుకోండి:

యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్క్రీన్‌పై డేట్, టైం, లొకేషన్, కారు స్పీడ్ కనిపించేలా ఆప్షన్స్ ఆన్ చేసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వివరాలు ఇన్సూరెన్స్ లేదా పోలీసులకు బలమైన సాక్ష్యంగా ఉపయోగపడతాయి. అలాగే యాప్‌లో ఉండే జి-షాక్ సెన్సార్‌ను ఆన్ చేయడం ద్వారా, కారు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఆ వీడియో ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది. అంటే అది డిలీట్ అవ్వదు.

ఫోన్ హోల్డర్, ఛార్జింగ్ ముఖ్యం:

చివరిగా ఫోన్‌ను కారు విండ్‌షీల్డ్ లేదా డ్యాష్‌బోర్డ్‌పై గట్టిగా ఉండే హోల్డర్ సహాయంతో అమర్చండి. కెమెరా రోడ్డు, ట్రాఫిక్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపించేలా కాస్త కిందకు వంచి పెట్టాలి. నిరంతరం రికార్డింగ్, జీపీఎస్ రన్ అవ్వడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది కాబట్టి.. కారు ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచాలి. ఇలా చాలా తక్కువ ఖర్చుతో పాత ఫోన్‌కు సరికొత్త లైఫ్ ఇవ్వొచ్చు.

Also Read: చీప్ ధరలో Ultra లెవెల్ ఫోన్.. రెడ్‌మీ దెబ్బకు మిగతా బ్రాండ్స్ షేక్, ఫీచర్లు చూశారంటే..

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×