BigTV English

HTC U24 Pro Launched: మళ్లీ వచ్చేశాడు రా బాబు.. HTC రీ ఎంట్రీ.. ఈసారి హిట్ పక్కా!

HTC U24 Pro Launched: మళ్లీ వచ్చేశాడు రా బాబు.. HTC రీ ఎంట్రీ.. ఈసారి హిట్ పక్కా!

HTC U24 Pro Launched: స్మార్ట్‌ఫోన్ కంపెనీ HTC స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. HTC తన కొత్త స్మార్ట్‌ఫోన్ HTC U24 Proని విడుదల చేసింది. ఈ ఫోన్ 120Hz OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7-సిరీస్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సపోర్ట్‌ ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను తాజాగా తైవాన్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సరికొత్త HTC U24 Proలో ప్రత్యేకత ఏమిటి? ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


HTC U24 Pro స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.8-అంగుళాల OLED డ్యూయల్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఫ్రంట్ ఫేసింగ్ LED డ్యూయల్ కలర్ నోటిఫికేషన్ లైట్‌ని కూడా కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Also Read: వన్‌ప్లస్ షాకింగ్ డీల్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వదిలిపెట్టలేరు!


HTC U24 Proలో బ్యాక్ OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ 2x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్‌ ఉంటాయి. కెమెరా సిస్టమ్ AI ఆప్టిమైజ్ చేసిన గ్రూప్ ఫోటోలు, AI gesture, GIF, AI లైట్ పోర్ట్రెయిట్ డెవలప్‌మెంట్, 4K వీడియో రికార్డింగ్ వంటి AI ఫీచర్‌లతో ఉంటుంది.

HTC U24 Pro స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్, 12 GB+ RAM+ 256 GB / 512 GB UFS 3.1 స్టోరేజ్  ఉంటుంది. ఇది 60W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో  4,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14తో ప్రీఇన్‌స్టాల్ వస్తుంది. ఇతర ఫీచర్లలో 3.5mm ఆడియో జాక్, USB-C పోర్ట్, డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇది ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

Also Read: దేశీయ టెక్ దిగ్గజం బిగ్ ట్విస్ట్.. చీపెస్ట్ 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్‌లో ఛాంపియన్!

HTC U24 Pro స్మార్ట్‌ఫోన్ ధర గురించి చెప్పాలంటే తైవాన్‌లో రెండు కాన్ఫిగరేషన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని 12GB + 256GB బేస్ మోడల్ ధర $585 అంటే సుమారు రూ. 48,884. 12GB + 512GB మోడల్ ధర $650 అంటే సుమారు రూ. 54,315గా ఉంటుంది. ఇది రెండు రంగు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. వీటిలో స్పేస్ బ్లూ, ట్విలైట్ వైట్ కలర్ ఉన్నాయి. ప్రస్తుతం తాజా ఫోన్ U24 Pro విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు.

Tags

Related News

Smartphone Tips: మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Prepaid Cards: ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు.. క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా సులభ లావాదేవీలు

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Big Stories

×