BigTV English

Lava Cheapest 5G Phone: దేశీయ టెక్ దిగ్గజం బిగ్ ట్విస్ట్.. చీపెస్ట్ 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్‌లో ఛాంపియన్..!

Lava Cheapest 5G Phone: దేశీయ టెక్ దిగ్గజం బిగ్ ట్విస్ట్.. చీపెస్ట్ 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్‌లో ఛాంపియన్..!

Lava Launched Cheapest 5G Phone: దేశీయ మొబైల్ కంపెనీ లావా కొద్ది రోజుల క్రితం భారతదేశంలో LAVA YUVA 5G ఫోన్‌ను విడుదల చేసింది. Lava Yuva 5G అనేది కంపెనీ కొత్త ఫోన్. ఇది 6.52 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. లావా ఈ ఫోన్‌ను చాలా ప్రత్యేకంగా Gen-Zని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చింది. ఈ ఫోన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ UNISOC T750 5G చిప్‌సెట్‌తో అప్‌గ్రేడ్ చేసింది. కొత్త Lava Yuva 5Gలో ప్రత్యేకత ఏమిటి? ఫీచర్లు ఎలా ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.


లావా తన యువ సిరీస్‌లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.52-అంగుళాల LCD ప్యానెల్ ఉంది. ఇది HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 2.5D కర్వ్‌డ్ గ్లాస్‌ కలిగి ఉంటుంది. ఫోన్ ఫ్రంట్‌లో ఫ్లాట్ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. అలానే వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP సెన్సార్ ఉన్నాయి. ఇది మాటీ ఫినిషింగ్‌తో కూడిన ప్రీమియం గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది.

అంతేకాకుండా, Lava Yuva 5G గీక్‌బెంచ్ ప్లాట్‌ఫారమ్‌లో LXX513 మోడల్ నంబర్‌తో రిజిస్టర్ అయింది. ఇది ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ చిప్‌సెట్ కలిగి ఉంది. ఇది డైమెన్సిటీ 6300 SoC లేదా డైమెన్సిటీ 6080 SoC, 2.4GHz వద్ద క్లాక్ చేయబడిన రెండు కోర్‌లను, 2.0GHz వద్ద ఆరు కోర్‌లను కలిగి ఉంటుంది.


Also Read: ఇది ఏదో బాగుందే.. HMD నుంచి బడ్జెట్ కిల్లర్.. ఆపడం కష్టమేనేమో..!

Lava Yuva 5G ఫోన్‌లో 4GB RAM+64GB/128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌‌లో పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ ధర గురించి చెప్పాలంటే 4 GB RAM + 64 GB స్టోరేజ్‌తో LAVA YUVA 5G ఫోన్ ధర రూ.9,499. కాగా, 128 GB RAM ఉన్న మోడల్ ధర రూ.9,999. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అందులో మిస్టిక్ బ్లూ, గ్రీన్ ఉన్నాయి. మీరు దీన్ని Amazon, Lava ఇ-స్టోర్.  ఇతర రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

Smartphone Tips: మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Prepaid Cards: ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు.. క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా సులభ లావాదేవీలు

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Big Stories

×