Huawei Band 11 Pro Review: ఈ రోజుల్లో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టే వారి సంఖ్య బాగా పెరిగింది. దానికి తగ్గట్టే ప్రముఖ టెక్ బ్రాండ్ హువావే తన సరి కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్ కోరుకునే వారి కోసం అల్ట్రా-స్లిమ్ డిజైన్, ఏకంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్, పర్ఫెక్ట్ స్లీప్ అండ్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో ఈ స్మార్ట్ బ్యాండ్ రూపుదిద్దుకుంది. ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మోడల్ లో స్పెషల్ అట్రాక్షన్ దీని అల్ట్రా-స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్. చేతికి పెట్టుకుంటే.. అసలు బ్యాండ్ ఉన్నట్టే అనిపించనంత తేలిగ్గా ఉంటుంది.
డిస్‌ప్లే: ఇందులో బిగ్ అండ్ కలర్‌ఫుల్ అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. దీని వల్ల ఎండలో ఉన్నా సరే నోటిఫికేషన్లు, టైమ్, హెల్త్ డేటా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.
ప్రీమియం లుక్: రోజు వారీ వాడకంతో పాటు స్పోర్టీ లుక్ ఇచ్చే రక రకాల రంగులు, స్ట్రాప్ ఆప్షన్లు ఇందులో.. అందుబాటులో ఉన్నాయి.
మీ ఆరోగ్యంపై.. నిరంతరం నిఘా ఉంచేందుకు.. ఇందులో అనేక సెన్సార్లు ఇచ్చారు.
ట్రూస్లీప్ టెక్నాలజీ: రాత్రి వేళ మీ నిద్రను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మీరు ఎంతసేపు గాఢ నిద్రలో ఉన్నారు, నిద్ర నాణ్యత ఎలా ఉందో రికార్డ్ చేసి, మంచి నిద్ర కోసం సలహాలు కూడా ఇస్తుంది.
హార్ట్ రేట్ & SpO2: గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను 24 గంటలూ ట్రాక్ చేస్తుంది. ఏవైనా తేడాలు ఉంటే.. అలర్ట్ చేస్తుంది.
స్ట్రెస్ మానిటరింగ్: మీ మానసిక ఒత్తిడి స్థాయిలను గుర్తించి, మైండ్ రిలాక్స్ అవ్వడానికి బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్‌ను సూచిస్తుంది.
మీ వర్కౌట్స్ రికార్డ్ చేయడానికి.. ఇందులో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా వంటి ప్రతీ యాక్టివిటీని ఇది అక్యురేట్‌గా ట్రాక్ చేస్తుంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల స్విమ్మింగ్.. చేసేటప్పుడు కూడా ధైర్యంగా వాడుకోవచ్చు.
సాధారణంగా స్మార్ట్ వాచ్‌లను రోజు విడిచి రోజు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ మోడల్ లో 14 రోజుల బ్యాటరీ లైఫ్ అందించడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఒక సారి ఛార్జ్ చేస్తే.. రెండు వారాల పాటు ఛార్జర్ పక్కన పెట్టేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల కొద్ది నిమిషాల్లోనే రోజంతా వాడేంత ఛార్జ్ అయిపోతుంది.
Also Read: బిగ్ స్క్రీన్ లవర్స్‌కు పండగే..మార్కెట్‌లోకి మరో కొత్త ప్రొజెక్టర్ వచ్చేసింది!
ఇండియన్ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ..6,299 గా ఉంది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో, హువావే అధికారిక స్టోర్లలో అందుబాటులో ఉంది. సేల్ ఆఫర్లలో.. బ్యాంక్ కార్డ్స్ వాడితే.. ఇంకాస్త తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.
రూ. 6,299 బడ్జెట్‌లో.. ప్రతిరోజూ.. ఛార్జింగ్ పెట్టే తిప్పలు లేకుండా.. అక్యూరేట్ స్లీప్ ట్రాకింగ్, అల్ట్రా-స్లిమ్ లుక్, టాప్-నోచ్ ఫిట్‌నెస్ ఫీచర్లు కోరుకునే.. వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ అండ్ ట్రెండీ ఛాయిస్!