E-Paper
Advertisement

ఓటీటీలోకి ట్రెండీ యూత్ కామెడీ… ఒకే ఇంట్లో 5 మంది ఫ్రెండ్స్… రూమ్‌మేట్స్ సీక్రెట్స్ బయటపడితే ఇంత రచ్చా?

ఓటీటీలోకి ట్రెండీ యూత్ కామెడీ… ఒకే ఇంట్లో 5 మంది ఫ్రెండ్స్… రూమ్‌మేట్స్ సీక్రెట్స్ బయటపడితే ఇంత రచ్చా?
Advertisement

Comedy Web Series on OTT: ఒకే ఇంట్లో ఐదుగురు ఫ్రెండ్స్… ఎవరి జీవితం వారిదే, కానీ ఒకరి సమస్యలోకి మరొకరు వెళ్లకుండా ఉండటం మాత్రం అసాధ్యం. పైగా ఒకరోజు తమ బెడ్‌రూమ్స్ మార్చుకుంటే ? ఇంతకాలం దాచుకున్న సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడితే ? ఫ్రెండ్‌షిప్ ఉంటుందా… లేక ఇంట్లోనే వార్ మొదలవుతుందా ? Gen-Z లైఫ్, రిలేషన్‌షిప్స్, కెరీర్ టెన్షన్స్‌ను ఫుల్ కామెడీగా చూపించే సిరీసే ‘Adults Season 2’. మరి ఈ సీజన్‌లో ఏం జరుగుతుంది ? ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? తెలుగులో ఉందా ? ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

న్యూయార్క్‌లో ఒకే ఇంట్లో కలిసి ఉండే సమీర్, బిల్లీ, పాల్ బేకర్, ఇస్సా, ఆంటన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బయటికి మంచి ఫ్రెండ్స్‌లా కనిపించినా… కలిసి ఉండటం వల్ల ఒకరి సమస్య మరొకరికి కూడా తలనొప్పిగా మారుతుంది. ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం… ఏ విషయంలో సమస్య వచ్చినా మిగతా వాళ్లు అందులోకి వచ్చేస్తారు. సాయం చేయాలని మొదలు పెట్టిన పని చివరికి మరింత గందరగోళంగా మారడం వీళ్లకు కామన్.

Advertisement

ఈ సీజన్‌లో పాల్ బేకర్ దాచిన ఓ సీక్రెట్ బయటపడటంతో ఇంట్లో రచ్చ మొదలవుతుంది. మరోవైపు బిల్లీ ఉపయోగించిన ఫేక్ ఐడీ వ్యవహారం ఊహించని సమస్యను తెస్తుంది. ఇస్సా, పాల్ రిలేషన్‌షిప్స్‌లో కూడా కొత్త చిక్కులు ఎదురవుతాయి. ఆంటన్ తన సోదరి కుటుంబాన్ని ప్రారంభించబోతుందని తెలుసుకుని తన జీవితాన్ని కూడా ఆలోచించడం మొదలుపెడతాడు. అయితే సీజన్‌లో అసలు కామెడీ ‘Room Swap’ ఎపిసోడ్‌లో మొదలవుతుంది. ఐదుగురు తమ బెడ్‌రూమ్స్ మార్చుకోవడంతో… ఎవరి గదిలో ఏం దాచారో, ఎవరి అలవాట్లు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఫ్రెండ్ గురించి తనకు అన్నీ తెలుసనుకున్న వాళ్లకు అసలు నిజం తెలిసి షాక్ అవుతారు.

ఇక వీళ్ల సమస్యలు ఇంటితో ఆగవు. కెరీర్, ప్రేమ, కుటుంబం, డబ్బు వంటి నిజ జీవిత సమస్యలను ఈ గందరగోళంతోనే ఫేస్ చేస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతూ మరో సమస్యను సృష్టించుకోవడమే ఇందులో ఉండే అసలు కామెడీ. అయినా ఒకరినొకరు ఎంత ఇబ్బంది పెట్టుకున్నా… అవసరమైనప్పుడు మాత్రం అందరూ కలిసి నిలబడతారు. పెద్దవాళ్లుగా మారే క్రమంలో తడబడుతున్న ఈ ఐదుగురి ఫ్రెండ్‌షిప్‌ గురించి తెలుసుకోవాలంటే సిరీస్‌ పై ఒక లుక్కేయండి

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘అడల్ట్స్ సీజన్ 2’కు బెన్ క్రోన్‌గోల్డ్, రెబెక్కా షా క్రియేటర్లుగా వ్యవహరించారు. మాలిక్ ఎలస్సాల్, లూసీ ఫ్రేయర్, జాక్ ఇన్నానెన్, అమితా రావ్, ఓవెన్ థీలే ప్రధాన పాత్రల్లో నటించారు. సీజన్ 2 ఆగస్టు 27న విడుదలైంది. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. దీనికి ముందు జూలై 31న ‘Marathon Day’ అనే ప్రీక్వెల్ ఎపిసోడ్ కూడా విడుదలైంది. ఇండియాలో JioHotstarలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం లేదు. వీకెండ్ కి ఈ సిరీస్ మంచి ఎంటర్టైనర్ అవుతుంది. ముఖ్యంగా ‘Room Swap’ ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్ రహస్యాలు బయటపడే తీరు ఫుల్ ఫన్ ఇస్తుంది.

Read Also: బాట్‌మ్యాన్‌కే భయంకరమైన రాత్రి… నిద్ర లేకుండా చేసే విలన్… ఈ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

Tags

Related News

డ్యాన్సర్‌ నుంచి కోట్ల సామ్రాజ్యానికి బాస్‌గా… ఓటీటీలోకి తెలుగులో హై-వోల్టేజ్ డ్రామా

ఎయిర్‌పోర్ట్‌లో రోజుకో సమస్య… వాటి వెనుక దిమ్మతిరిగే కథలు… ఈ సిరీస్ మిస్ కావొద్దు

ఓటీటీలోకి యశ్ టాక్సిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గుండెను చీల్చీ చూస్తే… టీవీ ప్రత్యక్షం, ఇదెక్కడి థ్రిల్లర్ మామా… మైండ్ బెండింగ్ అనుకో!

పాడుబడిన స్కూల్ లో పారానార్మల్ సీన్స్… సైకాలజిస్ట్‌కు ఎదురైన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ నిజం

టాక్సిక్ టాక్.. డిజిటల్ రైట్స్ పై భారీ ఎఫెక్ట్.. నిర్మాతల రియాక్షన్?

మనుషుల్ని చంపే పులిని పట్టుకోవడానికెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×