E-Paper
Advertisement

Hyped Samvadini: వాట్సాప్‌కు ధీటుగా దేశీయ యాప్.. హైప్డ్ సంవాదిని ఎంట్రీ, డేటా సేఫ్ కూడా

Hyped Samvadini: వాట్సాప్‌కు ధీటుగా దేశీయ యాప్.. హైప్డ్ సంవాదిని ఎంట్రీ, డేటా సేఫ్ కూడా
Advertisement

Hyped Samvadini: భారతీయులు విదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను అధికంగా ఉపయోగిస్తుండటంతో భద్రత, గోప్యతపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఆర్థిక మోసాలు, స్పామ్, డిజిటల్ అరెస్టులు లాంటి సైబర్ బెదిరింపులు రెట్టింపు అయ్యాయి. విదేశీ సర్వర్‌లలో ఇలాంటి ముప్పును పర్యవేక్షించడంలో ఉన్న ఇబ్బందులు వ్యక్తిగత భద్రత, జాతీయ భద్రతపై ఆందోళనలను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రతపై దృష్టి సారించిన ప్రభుత్వం, దేశీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో అనువాదిని ఏఐ రెండు అప్లికేషన్లను పరిచయం చేసింది. అందులో ఒకటి హైప్డ్ సంవాదిని, మరొకటి దేశీ ఏఐ జెన్‌జెడ్ కీబోర్డ్.

హైప్డ్ సంవాదిని ఎంట్రీ, దీంతో భారతీయుల డేటా సేఫ్

Advertisement

దేశంలో వాట్సాప్‌కు ధీటుగా కొత్త స్వదేశీ మెసేజింగ్ యాప్ ఎంట్రీ ఇచ్చేసింది. హైప్డ్ సంవాదిని పేరిట అందుబాటులోకి వచ్చింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని ఏఐసీటీఈకి చెందిన అనువాదిని ఏఐ యాప్‌ను క్రియేట్ చేసింది. విదేశీ యాప్‌లపై ఆధారపడకుండా భారతీయుల డేటా భద్రంగా ఉండాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. మరి యాప్‌లో అసలు విషయాలు, ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.

భారత్ సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. తాజాగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో ఏఐసీటీఈ కి చెందిన అనువాదిని ఏఐ బృందం ‘హైప్డ్ సంవాదిని’ యాప్‌ని రంగంలోకి దించింది. ఒక్కమాటలో చెప్పాలంటే వాట్సాప్ ధీటుగా దీన్ని క్రియేట్ చేసినట్టు టెక్ విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement

విదేశీ యాప్‌లపై ఆధారపడకుండా భారతీయులు డేటా స్వదేశంలో భద్రంగా ఉండాలనేది దీని అసలు లక్ష్యం. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది ఈ యాప్. వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేయనుంది. ఇక యాప్‌లో ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సిమ్ స్వాప్ మోసాలను గుర్తించేందుకు ‘సిమ్-డివైస్ బైండింగ్’ పేరిట ఫీచర్‌ని దాని సొంతం.

వాట్సాప్‌కు ధీటుగా దేశీయ యాప్

యూజర్ ప్రమేయం లేకుండా సిమ్ ఒకవేళ మారితే వెంటనే వారిని అలర్ట్ చేయనుంది. ఫోన్ నంబర్ మరొకరికి షేర్ చేయకుండా ‘డైనమిక్ చాట్ ఐడీల’ ద్వారా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఫీచర్ ఉంది. దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం ఏ మాత్రం వాటిల్లదు. అంతేకాదు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో చాట్‌తోపాటు కాల్స్ సురక్షితం.

భాషా విషయంలో అడ్డంకులను తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అందులో 22 భారతీయ భాషలు, 50కి పైగా అంతర్జాతీయ భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ చేసే ఫీచర్ హైప్డ్ సంవాదిని సొంతం. వాట్సాప్ నుంచి పాత చాట్‌లను సులభంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చివరకు మహిళలు, వృద్ధుల భద్రత కోసం వన్-ట్యాప్ SOS అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ALSO READ: మీ ఇంట్లోనే ఏఐ డాక్టర్.. పర్‌ప్లెక్సిటీలో కొత్త ఏఐ హెల్త్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?

దీనికితోడు ‘డెసి ఏఐ జెన్‌జెడ్ కీబోర్డ్’ని పరిచయం చేసింది. భారతీయ భాషలకు సపోర్ట్ చేయడం, స్మార్ట్ టైపింగ్ సలహాలు, గెస్చర్ టైపింగ్ వంటివి కీలకం.భారతీయుల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×