E-Paper
Advertisement

మార్కెట్‌ను షేక్ చేస్తున్న..IFB వాషింగ్ మెషీన్! ధర కూడా చాలా తక్కువ

మార్కెట్‌ను షేక్ చేస్తున్న..IFB వాషింగ్ మెషీన్! ధర కూడా చాలా తక్కువ
Advertisement

IFB 6 kg front load washing machine: ఇంట్లో బట్టలు ఉతకడం అంటే.. ఇదొక పెద్ద పనిలా కనిపిస్తుందా? రోజూ చేతులతో .. లేదా పాత వాషింగ్ మెషీన్లతో విసిగిపోయారా? అయితే మీ ఇంటికి సరి కొత్త, అడ్వాన్స్‌డ్ వాషింగ్ మెషీన్ తెచ్చే సమయం వచ్చేసింది! ప్రముఖ హోమ్ అప్లయన్స్ బ్రాండ్ ఐఎఫ్‌బీ నుంచి.. వచ్చిన IFB 6 kg Fully Automatic Front Load Washing Machine (DIVA AQUA SX) మీ కష్టాన్ని చిటికెలో దూరం చేస్తుంది. కేవలం రూ. 23,799 ధరలో లభిస్తున్న ఈ మెషీన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫీచర్లు:

కెపాసిటీ, డిజైన్:

ఈ వాషింగ్ మెషీన్ 6 కేజీల కెపాసిటీతో వస్తుంది. ఇది 2 నుంచి 4 మంది ఉన్న చిన్న కుటుంబాలకు ఇది సరిగ్గా సరి పోతుంది. దీని ఫ్రంట్ లోడ్ డిజైన్ చాలా స్టైలిష్‌గా , ప్రీమియమ్‌గా ఉంటుంది. మీ ఇంటి బాత్రూమ్ లేదా యుటిలిటీ ఏరియాలో.. ఇది చాలా కాంపాక్ట్‌గా సెట్ అవుతుంది. అంతే కాకుండా దీని బాడీ క్వాలిటీ కూడా చాలా పటిష్టంగా ఉండి, తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉండేలా డిజైన్ చేశారు. దీని వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది.

వాషింగ్ టెక్నాలజీ:

Advertisement

ఐఎఫ్‌బీ డివా ఆక్వా ఎస్ఎక్స్ ప్రత్యేకత దాని.. వాషింగ్ టెక్నాలజీలోనే ఉంది. ఇందులో ఉండే  వాటర్ ట్రీట్మెంట్ డివైజ్ నీటిని బాగా కరిగించి.. డిటర్జెంట్ బట్టలకు లోతుగా ఇంకేలా చేస్తుంది. దీని వల్ల బట్టలపై ఉండే మొండి మరకలు కూడా ఇట్టే.. వదిలి పోతాయి. అలాగే.. ఇందులో ఉండే ప్రత్యేకమైన డ్రమ్ డిజైన్ బట్టలు చిరిగి పోకుండా.. సేఫ్ గా ఉతుకుతుంది.

ప్రత్యేక ఫీచర్లు,సేఫ్టీ:

హై స్పీడ్ స్పిన్:ఇందులో.. ఉన్న పవర్ ఫుల్ మోటార్ హై స్పీడ్‌తో తిరుగుతుంది. దీని వల్ల ఉతికిన తర్వాత బట్టల్లోని.. నీరు చాలా వరకు పోయి, త్వరగా ఆరిపోయేలా.. చేస్తుంది.

Advertisement

చైల్డ్ లాక్ : మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇందులో.. ప్రత్యేక మైన చైల్డ్ లాక్ ఫీచర్ ఉంటుంది. దీని వల్ల పిల్లలు బటన్లు నొక్కినా సెట్టింగ్స్ మారవు.

వోల్టేజ్ ప్రొటెక్షన్: కరెంట్  వోల్టేజ్   మారుతూ ఉన్నప్పుడు కూడా ఈ మెషీన్ సేఫ్‌గా పని చేసేలా డిజైన్ చేశారు.

Also Read: పోర్ట్రోనిక్స్ డాష్ 4 పార్టీ స్పీకర్.. తక్కువ ధరలో అద్భుతమైన సౌండ్!

ధర :

అన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తున్న..ఈ  మోడల్  మార్కెట్లో కేవలం రూ.23,799 ధరకే అందు బాటులో ఉంది. ఫ్రంట్ లోడ్ కేటగిరీలో.. ఈ బడ్జెట్‌లో ఇంత మంచి ఫీచర్లు ఇస్తున్న బ్రాండ్స్ చాలా తక్కువ. మీరు దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌ సైట్లు లేదా సమీపంలోని.. ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లలో కొను గోలు చేయవచ్చు. ఇప్పుడే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ను ఇంటికి తెచ్చుకుని మీ బట్టల ఉతికే పనిని ఈజీ చేసుకోండి.

Also Read: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 పవర్ బ్యాంక్స్..మీ ఫోన్‌కు ఏది బెస్ట్?

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×