E-Paper
Advertisement

మిస్ట‌ర్ న‌ఖ్వీ ఆ పొగ‌రంతా ప‌క్క‌కు పెట్టు..వెంట‌నే యూనిస్ ఖాన్ కు ప‌గ్గాలు ఇవ్వు

మిస్ట‌ర్ న‌ఖ్వీ ఆ పొగ‌రంతా ప‌క్క‌కు పెట్టు..వెంట‌నే యూనిస్ ఖాన్ కు ప‌గ్గాలు ఇవ్వు
Advertisement

Rashid Latif On Mohsin Naqvi:   పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి తెలిసిందే. చిన్న జట్ల చేతుల్లో ఓడిపోతూ.. దిగజారుతోంది. టెస్టుల్లో అయితే మరీ దారుణం. బంగ్లాదేశ్ చేతిలో కూడా వైట్ వాష్ అయింది పాకిస్తాన్. అటు వెస్టిండీస్ గడ్డపై పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇలాగే ఆడితే.. మళ్లీ గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ కావడం పక్కా అంటున్నారు.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

మిస్ట‌ర్ న‌ఖ్వీ ఆ పొగ‌రంతా ప‌క్క‌కు పెట్టు..వెంట‌నే యూనిస్ ను తీసుకురా

Advertisement

ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( PCB) కీలక సూచనలు చేశారు మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ (Rashid Latif). మిస్టర్ మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi’) నీ పొగరంతా పక్కకు పెట్టి… జట్టును కాపాడే దిశగా అడుగులు వేయి అంటూ హెచ్చరించారు. వెంటనే మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ ను ( Younis Khan) పాకిస్తాన్ హెడ్ కోచ్ గా నియామకం చేయి.. అప్పుడే జట్టుకు పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. లేకపోతే ప్రతి సిరీస్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోయి.. దిగజారడం గ్యారెంటీ అని హెచ్చరించారు. తాజాగా జరిగిన ఓ స్పోర్ట్స్ మీటింగ్ సందర్భంగా.. రషీద్ లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ కాపాడే మొనగాడు యూనిస్ ఖాన్‌ ఒక్కడే

ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును ( PCB) కాపాడేందుకు మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ ( Younis Khan) అవసరమని రషీద్ లతీఫ్ (Rashid Latif) పేర్కొన్నారు. మొహ్సిన్ నఖ్వీ తన కక్ష సాధింపు చర్యలను పక్కకు పెట్టి… యునిస్ ఖాన్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోచ్ గా అతనికి బాధ్యతలు ఇచ్చి… గౌతమ్ గంభీర్ ( Gambhir) తరహాలో ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే పాకిస్తాన్ జట్టును గాడిలో పెట్టగలుగుతాడని పేర్కొన్నారు.

Advertisement

కుర్ర క్రికెటర్ల ప్రతిభను వెలికి తీయడంలో యూనిస్ ఖాన్ కు మంచి అనుభవం ఉందని గుర్తు చేశారు. ఎవరికీ లేని టాలెంట్ అతడిలో ఉందని వివరించారు. అతనికి కోచ్ బాధ్యతలు అప్పగిస్తే.. పాకిస్తాన్ జట్టును గెలిపించే సభ్యులను తయారు చేస్తాడని వివరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ త్వరగా అభివృద్ధి చెందాలంటే వెంటనే నఖ్వీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతడిని కాదని ముందుకు వెళ్తే మాత్రం పాకిస్తాన్ జట్టును కాపాడడం అల్లా వల్ల కూడా కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఒక మెట్టు దిగి వచ్చి.. యూనిస్ ఖాన్ కు ఫుల్ పవర్స్ ఇవ్వాలని కోరారు.

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

Related News

వహాబ్ రియాజ్ వాడి వ‌ల్ల కాదు, మ‌హిళ‌ల జ‌ట్టును నాకు అప్ప‌గించండి !

Fact Check: బ‌రితెగించిన స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్..పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని మ‌రీ !

అంపైర్ల‌ను కొనుగోలు చేసి, పాకిస్తాన్ ను ఓడించారు..త‌న్వీర్ ఆరోప‌ణ‌లు!

రాంచీలో చిల్ అవుతోన్న ధోని, రిష‌బ్ పంత్..కారులో షికార్లు కొడుతూ

ధోని చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…47 ఏళ్ల‌ ఇమ్రాన్ తాహిర్‌ ను చూసి నేర్చుకో ?

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా సుల‌భంగా మైదానాలు కేటాయించారు !

రిటైర్మెంట్ ప్లేయ‌ర్ల‌ను దొంగ‌ల్లా చూస్తున్నారు…బీసీసీఐపై మైఖేల్ వాన్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×