BigTV English

Central budget: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎందుకింత చిన్నచూపు.. కనీసం..?

Central budget: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎందుకింత చిన్నచూపు.. కనీసం..?

Central budget: ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెద్దగా ప్రస్తావన లేదు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ, గిరిజిన యూనివర్సిటీ, గోదావరి- మూసీ అనుసంధానం, మెట్రో-2 ప్రాజెక్ట్ ఇలా ముఖ్యమైన వాటికి సంబంధించి ఎలా ప్రస్తావన రాలేదు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ సీనియర్ నేతల కేంద్ర బడ్జెట్‌పై ఫైరవుతున్నారు.


కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులకు సంబంధించి త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు మాత్రమే వరాలు దక్కాయి. తెలంగాణకు కనీసం కేటాయింపులు దక్కకపోవడంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ రాష్ట్రం వాటా 5 శాతం. అయితే జీడీపీలో ఇంత శాతం ఉన్నా నిధులు రాకపోవడంపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.26వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో కంటే 12శాతం  పన్నులు ఎక్కువ పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు దేనికని ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్‌లో కనీసం తెలంగాణ అనే పేరు కూడా ఎత్తకపోవడంపై నాయకులు ఫైర్‌లో ఉన్నారు.

బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు తెలంగాణ అంటే ఎందుకంత చిన్నచూపో అని కేటీఆర్ నిలదీశారు. గత బడ్జెట్ లాగానే ఈ సారి కూడా తెలంగాణ పదమే ఉచ్చరించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఏది రాకపోవడం రాష్ట్ర విద్యార్థులకు, వారి పేరెంట్స్‌కు అన్యాయం చేయడమే అని అన్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోదీ సర్కార్ ద్రోహం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. మెట్రో విస్తరణకు కేంద్రం వాటా కింద నిధులు కేటాయించలేదని, మూసీ పునరుజ్జీవం కోసం రూ.4 వేల కోట్లు అడిగితే రూపాయికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, న‌వోద‌య‌, సైనిక్‌ స్కూల్స్​ గురించి ప్రస్తావనే లేకపోవడం.. అలాగే కొత్త విమానాశ్రయాలకు నిధులు కోరినా ఇవ్వలేదని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: BREAKING: పబ్‌లో దొంగ.. పోలీసులనే కాల్చేశాడు.. చివరకు..?

అయితే.. బడ్జెట్‌లో రాష్ట్ర కేటాయింపులపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు, రంగాలకు ఎన్ని నిధులు ఇచ్చారని సీఎం, మంత్రులతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు కేంద్ర కేటాయింపులు, రాష్ట్రాల వాటా, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం, లాభ నష్టాలపై కూడా మంత్రి వర్గం చర్చించింది. రంగాలవారీగా అధ్యయనం చేసి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, ప్రణాళికలపై చర్చ జరిపినట్లుగా సమాచారం.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×