Big Stories

Indian Railways Free WiFi : రైల్వే‌స్టేషన్‌లో హైస్పీడ్ వైఫై.. ఈ ట్రిక్స్‌తో వాడేయండి!

india

- Advertisement -

Indian Railways Free WiFi : మన దేశంలో రైల్వే ప్రయాణాలు చేసే ప్రయాణికుల సంఖ్య విమానాల్లో ప్రయాణించే వారి కంటే ఎక్కువగా ఉంటుంది. రైల్వే ప్రయాణం మన దేశంలో చాలా చౌకైనది. అలానే భద్రత కలిగింది. కానీ మన రైల్వేలు అత్యంత ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్ని జంక్షన్లో రైలు ఆగితే కదిలేందుకు గంటల సమయం పడుతుంది. దీంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతుంటారు.

- Advertisement -

ఇటువంటి ప్రయాణికలను దృష్టిలో పెట్టుకున్న భారతీయ రైల్వే ఉచిత హైస్పీడ్ ఇంటర్ నెట్ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేలకు పైగా రైల్వే స్టేషన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ స్టేషన్లలో ప్రయాణికులు తమ మొబైల్ లేదా ల్యాప్‌ట్యాప్‌లో లాగినై ఫ్రీ ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు.

Read More : రూ.53 వేలకే ఐఫోన్​ 15.. ఇదే సూపర్​ డీల్​! మిస్​ అవ్వకండి..

అయితే ఈ ఫ్రీ వైఫైని ఎలా వాడాలనే మనలో చాలా మందికి తెలియదు. ఈ వైఫై కోసం కిందామీద పడుతుంటారు. వైఫై ఎంత సమయం వస్తుంది, దాని స్పీడ్ ఎంత ఉంటుంది అనేది కూడా తెలియదు. దీనికి సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందా..

భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. రైల్వే ఫ్రీ వైఫై ఒక రోజులో 30 నిమిషాలు ఉచితంగా 1mbps స్పీడ్‌‌తో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అయితే దీని కంటే ఎక్కువ హై స్పీడ్ డేటా కావాలంటే రూ.10 అధనంగా పే చేయాలి. దీని వ్యాలిడీటి 24 గంటలు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా రూ.75 చెల్లిస్తే, 34Mbps వేగంతో 60GB డేటా అందిస్తుంది భారతీయ రైల్వే. ఇది 30 రోజులు పాటు అందుబాటులో ఉంటుంది.

Read More : మ‌స్క్ మామ మామూలోడు కాదు.. జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్..!

మన రైల్వే ఫ్రీగా ఇచ్చే వైఫైతో హెచ్‌డీ క్వాలిటీ వీడియోస్, సినిమాలు చూడొచ్చు. మంచి సంగీతం వినొచ్చు. మొబైల్, ల్యాప్‌ట్యాప్‌లలో గేమ్స్ కూడా ఆడొచ్చు. అయితే ఇవన్నీ చేయడానికి ఫ్లాట్‌ఫామ్ మీదనే ఉండాలి.

రైల్వే ఫ్రీ వైఫై ఎలా వాడాలి..?

  1. మొదటగా మొబైల్‌లో కుడివైపు కనిపించే వైఫై ఆప్షన్ క్లిక్ చేయాలి.

2. తర్వాత రైల్వే నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.

3. మొబైల్ బ్రౌజర్‌తో railwire.co.in వెబ్ పేజీని ఓపెన్ చేయాలి.

4. దీని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

5. మీ మొబైల్‌కి ఓటీపీ ద్వారా వైఫై పాస్‌వర్డ్ వస్తుంది.

6. ఇది ఎంటర్ చేశాక.. మీరు 30 నిమిషాల వరకు ఫ్రీ వైఫై ఎంజాయ్ చేయొచ్చు.

NOTE : ఫ్రీ వైఫైని కదిలో రైలులో వాడుకోలేము అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సేవలు కేవలం స్టేషన్ ఫ్లాట్‌ఫారమ్‌లో మాత్రయమే అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News