Big Stories

Ranji Trophy: రంజీ ట్రోఫీలో ముంబై ఆటగాళ్ల రికార్డ్.. చివరి బ్యాటర్లిద్దరూ సెంచరీలు..

Mumbai Batters CenturiesMumbai Batters Record In Ranji Trophy: ముంబై ఆల్‌రౌండర్లు తనుష్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే మంగళవారం ఒకే ఇన్నింగ్స్‌లో 10, 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీలు చేసి 1946 రికార్డును బద్దలు కొట్టారు.

- Advertisement -

ముంబైలోని BKC గ్రౌండ్‌లో బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ రెండవ ఇన్నింగ్స్‌లో కోటియన్, దేశ్‌పాండే రంజీ ట్రోఫీ చరిత్రలో పదో వికెట్‌కి రెండవ అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1946లో ఓవల్‌లో ఇండియన్స్, సర్రే మధ్య జరిగిన మ్యాచ్‌లో చందు సర్వాతే షూటే బెనర్జీలు ఒకే ఇన్నింగ్స్‌లో నం. 10, నం. 11లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలు సాధించారు. వారి తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో చివరి స్థానాల్లొ బ్యాటింగ్‌కు దిగి సెంచరీలు సాధించిన రెండవ జోడీగా కోటియన్, దేశ్‌పాండే ఎలైట్ జాబితాలో చేరారు.

- Advertisement -

మొత్తంగా వారు 232 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1991-92 సీజన్‌లో ఢిల్లీ ఆటగాళ్లు అజయ్ శర్మ, మణిందర్ సింగ్‌లు ముంబై టీమ్ పైన 233 పరుగులు చేసి రికార్డు నెలకొల్పారు.

Read More: Jan Nicol Loftie-Eaton: నమీబియా ఆటగాడి విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..

రెండవ ఇన్నింగ్స్‌లో 337 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయిన ముంబై జట్టును తనుష్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే పటిష్ట స్థితిలో నిలిపారు. కోటియన్ 115 బంతుల్లో తన సెంచరీని చేరుకున్నాడు. అదే సమయంలో దేశ్‌పాండే 112 బంతుల్లో సెంచరీ చేసి ఈ మైలురాయిని సాధించిన మొట్ట మొదటి 11వ ఆటగాడిగా నిలిచాడు.

దేశ్‌పాండే ఇన్నింగ్స్ 123 పరుగుల వద్ద ముగిసింది. అతన్ని నినాద్ రథ్వా అవుట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 569 పరుగుల భారీ స్కోరును చేసింది. ముంబై జట్టు బరోడాకు 606 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో బరోడా 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా గా ముగించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబై సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News