Big Stories

Elon Musk : మ‌స్క్ మామ మామూలోడు కాదు.. జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్..!

elon musk

- Advertisement -

Elon Musk Confirms Xmail : ఈ ఏడాది ఆగస్టులో జీమెయిల్ షట్‌డౌన్ అవుతుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. జీమెయిల్ అస్తమిస్తోందంటూ ఇంటర్నెట్లో ఓ ఫేక్ ఫొటో తెగ వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు కూడా నిజమనే అనుకున్నారు. ఈ న్యూస్ ఎక్స్‌లో బాగా ట్రెండ్ అయింది. దీంతో వెంటనే ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఎంట్రీ ఇచ్చాడు.

- Advertisement -

Read More : జీమెయిల్‌ మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్.. గూగుల్‌ క్లారిటీ..

జీమెయిల్ షట్ డౌన్ అయితేనేం.. మన ఎక్స్‌మెయిల్ వస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఎక్స్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ సభ్యులులోని సీనియర్ సభ్యుడు నాథన్ మెక్‌గ్రాడి ఎక్స్‌‌మెయిల్ ఎప్పుడు వస్తుందని ట్వీట్ చేశాడు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. సర్వీసు ప్రస్తుతం హోరిజోన్‌లో ఉందని నిర్ధారించారు.

మస్క్ ప్రకటించినట్లుగా ఎక్స్‌మెయిల్ తీసుకొస్తాడో లేదో గానీ ముందుగా ఒక రాయి మాత్రం వేసేశాడు. మస్క్ ప్రకటనపై స్పందించిన చాలామంది నెటిజన్లు.. మస్క్ మామ మూమూలోడు కాదు.. అన్నంత పనిచేస్తాడని సరదాగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే గూగుల్ ఈజ్ సన్‌సెట్టింగ్ జీమెయిల్ అనే పేరుతో ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ పోస్ట్ ట్విట్టర్‌‌లో వైరల్ అయింది.

దీంతో జీమెయిల్ భవిష్యత్తు గురించి యూజర్లలో భయాందోళనలకు దారితీసింది. ఇమెయిల్‌లను పంపడం, స్వీకరించడం, స్టోర్ చేసే సపోర్టును నిలిపివేస్తూ.. ఆగస్టు 1, 2024 నాటికి జీమెయిల్ అన్ని సేవలను నిలిపివేస్తుందని ఇమెయిల్ సారాశంలో పేర్కొంది. ఇది వైరల్ కావడంతో జీమెయిల్ వినియోగదారులకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News