E-Paper
Advertisement

Induction Stove: ఇండక్షన్ స్టౌ గురించి 10 సీక్రెట్స్ .. చాలా మందికి తెలియని నిజాలు !

Induction Stove: ఇండక్షన్ స్టౌ గురించి 10 సీక్రెట్స్ .. చాలా మందికి తెలియని నిజాలు !
Advertisement

Induction Stove: ఇప్పుడిప్పుడే చాలా మంది ఇళ్లలో గ్యాస్ స్టౌకి బదులుగా ఇండక్షన్ స్టౌ వాడకం పెరుగుతోంది. ఇది వేగంగా వంట చేయడానికి.. అంతే కాకుండా చిన్న స్థలంలో కూడా ఉపయోగించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఇండక్షన్ స్టౌ గురించి చాలా మందికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం ఆన్ చేసి వంట చేసేస్తాం కానీ దాని వెనక ఉన్న కొన్ని సీక్రెట్స్ తెలుసుకుంటే ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు. ఇండక్షన్ స్టౌ గురించి చాలా మందికి తెలియని 10 ఆసక్తికరమైన విషయాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండక్షన్ స్టౌ గురించి 10 సీక్రెట్స్ :

Advertisement

1. వేగంగా వంట:
ఇండక్షన్ స్టౌలో వేడి నేరుగా పాత్రలోనే ఉత్పత్తి అవుతుంది. అందుకే గ్యాస్ స్టౌతో పోలిస్తే వంట త్వరగా పూర్తవుతుంది. అంతే కాకుండా దీనిలో టెంపరేచర్ మార్చడానికి ఆప్షన్లు కూడా ఉంటాయి.

2. ప్రత్యేక పాత్రలు:
ఇండక్షన్ స్టౌలో మాగ్నెటిక్ బేస్ ఉన్న పాత్రలు మాత్రమే పనిచేస్తాయి. స్టీల్ లేదా ఇండక్షన్ ఫ్రెండ్లీ పాత్రలు అయితేనే వంట చేయగలం. ఇతర వంట పాత్రలు దీనిపై అస్సలు పని చేయవు.

Advertisement

3. విద్యుత్ ఖర్చు తగ్గే అవకాశం:
చాలా మంది ఇండక్షన్ స్టౌ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుందని అనుకుంటారు. కానీ సరైన పవర్ సెట్టింగ్‌లతో వాడితే కరెంట్ ఖర్చు నియంత్రణలో ఉంటుంది. గ్యాస్ తో పోలిస్తే మాత్రం దీనికి చాలా తక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది.

4. ఆటోమేటిక్ ఆఫ్ ఫీచర్:
చాలా ఇండక్షన్ స్టౌల్లో పాత్ర లేకపోతే లేదా ఎక్కువ వేడి అయితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. దీని వల్ల పాత్రలు మాడిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఇదిఈజీగా వంట చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

5. ఈజీ టెంపరేచర్ కంట్రోల్ :
ఇండక్షన్ స్టౌలో అవసరానికి అనుగుణంగా టెంపరేచర్‌ను సెట్ చేయవచ్చు. దీని వల్ల వంట సరిగ్గా అవుతుంది. అవసరం ఉన్నప్పుడు పెంచుకుని అవసరం లేనప్పుడు తగ్గించుకోవచ్చు.

6. చిన్న కిచెన్‌కు అనుకూలం:
ఇండక్షన్ స్టౌ చిన్న సైజ్‌లో ఉండటం వల్ల చిన్న కిచెన్‌లలో కూడా సులభంగా వాడుకోవచ్చు. ఈజీగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లి వాడుకోవచ్చు.

Also Read: హెల్తీ లైఫ్ కోసం బెస్ట్ స్మూతీ బ్లెండర్స్.. ఈ 5 తెలిస్తే ఇక జ్యూస్ సెంటర్‌కి వెళ్లరు!

7. క్లీనింగ్ చాలా ఈజీ:
ఇండక్షన్ స్టౌపై వంట చేసిన తర్వాత క్లీనింగ్ చాలా ఈజీ. ఒక తడి క్లాత్‌తో దీనిని తుడిస్తే మళ్లీ కొత్తదానిలాగా కనిపిస్తుంది.

8. గ్యాస్ లాగా మంట ఉండదు:
ఇండక్షన్ స్టౌలో గ్యాస్ మంట ఉండదు. అందుకే ప్రమాదాలు తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

9. మల్టిపుల్ కుకింగ్ మోడ్స్:
కొన్ని ఇండక్షన్ స్టౌల్లో రైస్, మిల్క్, ఫ్రై, బాయిల్ వంటి ప్రత్యేక కుకింగ్ మోడ్స్ ఉంటాయి. ఇవి అవసరాన్ని బట్టి మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

10. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు:
ఇండక్షన్ స్టౌ తేలికగా ఉండటం వల్ల ట్రావెల్ లేదా బయట కూడా ఈజీగా తీసుకెళ్లి వాడుకోవచ్చు.

Related News

సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!

భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!

వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!

ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!

200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

ప్రయాణాల్లో ఛార్జింగ్ తిప్పలు ఇక ఉండవు! రూ.వేయ్యిలోపు బ్రాండెడ్ పవర్ బ్యాంక్

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

Big Stories

Advertisement
×