E-Paper
Advertisement

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!
Advertisement

Samsung Galaxy S25 Price Drop: టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయిన ‘గెలాక్సీ S25’ మోడల్ ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ఫ్లాగ్‌షిప్ డివైజ్ కోసం చూస్తుంటే.. ఇంత కంటే మంచి అవకాశం రాదనే చెప్పాలి. ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బొనాంజాతో ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఇప్పుడీ శాంసంగ్ గెలాక్సీ S25 మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

ఎంత ధర తగ్గిదంటే?

భారతదేశంలో రూ.80,999కి విడుదలైన ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.61,328కే అందుబాటులో ఉంది. అంటే.. దాదాపు రూ.22,000 వరకు నేరుగా ధర తగ్గింది. దీనికి తోడు PNB లుక్సురా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ.2,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.58,828కి చేరుతుంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ ధరను ఇంకా తగ్గించుకోవచ్చు.

Advertisement

Also Read: ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్..

చూడటానికి చాలా కాంపాక్ట్‌గా ఉండే ఈ Samsung Galaxy S25 ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, రోజువారీ టాస్క్‌లు వేగంగా జరగడానికి ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనికి తోడు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అలాగే ఇందులో 4000mAh బ్యాటరీ కలదు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కొనుగోలు చేయొచ్చా?

రూ.60,000 బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, బలమైన ప్రాసెసర్, మంచి కెమెరా సెటప్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఫోన్ కొనేముందు అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్లు, మీ ఏరియాకు ఎక్స్ఛేంజ్ వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Also Read: రూ.500 లోపు బెస్ట్ టైప్-సి, 3.5ఎంఎం ఇయర్ ఫోన్స్.. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్!

Tags

Related News

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×