E-Paper
Advertisement

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!
Advertisement

WhatsApp Support: మనలో చాలామందికి వాట్సప్‌లో ఏదైనా చిన్న సమస్య రాగానే వెంటనే కస్టమర్ కేర్ సపోర్ట్‌ను సంప్రదించడం అలవాటు. అయితే, మనం కేవలం సమస్య గురించి టైప్ చేసి పంపిస్తే చాలు.. వాళ్లు ఆ ప్రాబ్లం ఏంటో చూసి దాన్ని వెంటనే పరిష్కరిస్తారు అని అనుకుంటే పొరపాటే. మీరు ఎప్పుడైనా వాట్సప్ సపోర్ట్‌ను కాంటాక్ట్ చేసినప్పుడు.. మీ మెసేజ్‌తో పాటు మీ ఫోన్‌కు సంబంధించిన చాలా సాంకేతిక సమాచారం కూడా వాళ్ల సిస్టమ్ దగ్గరకు ఆటోమేటిక్‌గా వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? అవును.. మీ సమస్యను త్వరగా పరిష్కరించడానికి వాట్సప్ మీ వివరాలను కూడా తీసుకుంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఏయే వివరాలు సేకరిస్తుంది?

మీరు సపోర్ట్ టీమ్‌తో మాట్లాడేటప్పుడు.. మీ ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ నెట్‌వర్క్, స్టోరేజ్ కెపాసిటీ, మీరు వాడుతున్న వాట్సప్ వెర్షన్ లాంటి ఎన్నో సాంకేతిక వివరాలను తీసుకుంటుంది. అలాగే మీరు యాప్‌లో ఏయే భాషా సెట్టింగ్స్ వాడారు, యాప్ పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, చాట్ బ్యాకప్ ఎప్పుడు తీసుకున్నారు అనే ముఖ్యమైన విషయాలు కూడా వాళ్లకి వెళ్తాయి.

సమస్యను బట్టే డేటా..

Advertisement

అయితే అందరి దగ్గరా ఒకేలా డేటా తీసుకోరు. మీరు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, అలాగే కాంటాక్ట్ చేస్తున్న పద్ధతిని బట్టి ఈ డేటా సేకరణ మారుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఫోన్ నెట్‌వర్క్ సమస్యల వల్ల ఇబ్బంది వస్తుందా లేదా ఫోన్ లోపలి సెట్టింగ్స్ వల్ల వాట్సప్ సరిగ్గా పనిచేయట్లేదా అని తెలుసుకోవడానికే ఈ సమాచారాన్ని వాడతారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

కాంటాక్ట్ చేసే విధానం..

Advertisement

మనం నేరుగా వాట్సప్ యాప్ లోపల సెట్టింగ్స్ ద్వారా కానీ, లేదా వాళ్ల అఫీషియల్ వెబ్‌సైట్ కాంటాక్ట్ ఫామ్ ద్వారా కానీ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా మనకు రిప్లై ఇస్తుంది. అలా ఏఐ పంపిన మెసేజ్‌లను గుర్తించడానికి ప్రత్యేకమైన ఏఐ స్పార్కిల్ సింబల్ కూడా ఉంటుంది.

నకిలీ అకౌంట్లతో జాగ్రత్త..

కస్టమర్ కేర్ పేరుతో కొందరు మోసగాళ్లు ఫేక్ మెసేజ్‌లు చేస్తుంటారు. అందుకే మీకు వచ్చిన రిప్లై నిజమైన వాట్సప్ టీమ్ నుంచే వచ్చిందా లేదా అని కచ్చితంగా చూసుకోవాలి. అఫీషియల్ వాట్సప్ అకౌంట్‌కు ఎప్పుడూ వెరిఫైడ్ బ్యాడ్జ్ లేదా అఫీషియల్ సపోర్ట్ లేబుల్ ఉంటుంది కనుక దాన్ని గమనించాలి.

పరిష్కారం కోసమే ఇదంతా..

ఇంత డేటా తీసుకుంటున్నారు కదా అని కంగారు పడాల్సిన పనిలేదు. వాట్సప్ ఈ వివరాలన్నీ తీసుకునేది కేవలం మన సమస్య అసలు ఎక్కడ వచ్చిందో పసిగట్టి దాన్ని త్వరగా పరిష్కరించడానికే. అయితే, మనం ఏదైనా సమాచారం లేదా ఈ-మెయిల్స్ పంపితే అవి సరైన అఫీషియల్ సపోర్ట్ ఐడీలకే వెళ్తున్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి.

Also Read: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

Tags

Related News

అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

Big Stories

Advertisement
×