Instagram New Feature: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మన ప్రొఫైల్ మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఎన్నో రకాల మార్పులు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా సరికొత్తగా అలాంటి ఒక అదిరిపోయే అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఎవరైనా మనల్ని ఏదైనా ఒక ఫోటో లేదా ఒక వీడియోలో ట్యాగ్ చేస్తే.. ఆ పోస్టులు కేవలం ట్యాగ్డ్ సెక్షన్‌లో మాత్రమే కనిపించేవి. కానీ, ఈ కొత్త ఫీచర్ ద్వారా మనకు నచ్చిన ట్యాగ్డ్ పోస్టులను నేరుగా మన మెయిన్ ప్రొఫైల్ గ్రిడ్‌లో కనిపించేలా చేసుకోవచ్చు.
సాధారణంగా మనం అప్‌లోడ్ చేసిన పోస్టులు మాత్రమే మన మెయిన్ ప్రొఫైల్‌లో కనిపిస్తాయి. స్నేహితులతో దిగిన గ్రూప్ ఫోటోలు లేదా కొలాబరేషన్ వీడియోలలో మనల్ని ట్యాగ్ చేసినప్పుడు, అవి వేరే సెక్షన్‌లో ఉండిపోయేవి. కానీ, ఈ కొత్త అప్‌డేట్ వల్ల ఇకపై యూజర్లకు ఆ సమస్య ఉండదు. మీకు నచ్చిన, మీకు ఇష్టమైన ట్యాగ్డ్ కంటెంట్‌ను కూడా మీ సొంత పోస్టులతో పాటు మెయిన్ గ్రిడ్‌లో అందరికీ కనిపించేలా పెట్టుకోవచ్చు.
Also Read: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!
ఈ ఫీచర్‌ను వాడటం చాలా సులువు. ఎవరైనా మిమ్మల్ని ట్యాగ్ చేసినప్పుడు వచ్చే నోటిఫికేషన్ ద్వారా నేరుగా మెయిన్ గ్రిడ్‌కు యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆ పోస్ట్ ఓపెన్ చేసి, పైన ఉండే మూడు చుక్కల మెనూపై క్లిక్ చేసి కూడా మీ ప్రొఫైల్‌కు జత చేయవచ్చు. మరో అద్భుతమైన మార్గం ఏమిటంటే.. మీ ట్యాగ్డ్ సెక్షన్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన పోస్ట్‌ను కాసేపు నొక్కి పట్టి ఉంచడం ద్వారా కూడా గ్రిడ్‌లోకి సులభంగా పంపవచ్చు.
మీరు ఒక పోస్ట్‌ను మెయిన్ గ్రిడ్‌లో యాడ్ చేసినంత మాత్రాన దానికి మీరే యజమాని అయిపోరు. ఆ పోస్ట్ ఒరిజినల్ క్రియేటర్ చేతిలోనే పూర్తిగా కంట్రోల్ ఉంటుంది. వారి పోస్ట్‌ను మీ ప్రొఫైల్‌లో ఒక భాగంగా చూపించుకోవడానికి మాత్రమే ఈ సరికొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ఈ పోస్టులు వాటి ఒరిజినల్ పబ్లిష్ తేదీ ప్రకారమే మీ గ్రిడ్‌లో వరసగా అమరుతాయి.
మీరు ఒకసారి మెయిన్ గ్రిడ్‌లో యాడ్ చేసిన తర్వాత, ఎప్పుడైనా ఆ పోస్ట్‌ను వద్దు అనుకుంటే తీసేయొచ్చు. అలా తీసేసినంత మాత్రాన మీ అసలు పోస్ట్ డిలీట్ అవ్వదు. కేవలం మీ మెయిన్ ప్రొఫైల్ నుంచి మాత్రమే తొలిగిపోతుంది. కానీ, యథావిధిగా మీ ట్యాగ్డ్ సెక్షన్‌లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను తరచూ అందరితో షేర్ చేసుకునే వారికి ఈ అద్భుతమైన ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
Also Read: కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!