BigTV English

InfinixNote50s5G: 64MP సోని కెమెరా సహా క్రేజీ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్ సేల్ రేపే షురూ..

InfinixNote50s5G: 64MP సోని కెమెరా సహా క్రేజీ ఫీచర్ల స్మార్ట్‌ఫోన్ సేల్ రేపే షురూ..

InfinixNote50s5G: టెక్ ప్రియులు ఆశ్చర్యపోయేలా Infinix Note 50s 5G+ కొత్తగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఏప్రిల్ 18, 2025న అధికారికంగా విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్, మధ్యతరగతి వినియోగదారుల హృదయాలను గెల్చుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ప్రత్యేకమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యం వంటి అనేక రకాల ఫీచర్లతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.


డిస్‌ప్లే
6.78 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. అంటే గేమింగ్, స్క్రోల్ చేయడం, వీడియోస్ ఇలా అన్నీ దీనిలో ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇంకా 100% DCI-P3 కలర్, 10 బిట్ కలర్ డెప్త్ ఉండటం వల్ల రంగులు మరింత నాచురల్‌, డీప్‌గా కనిపిస్తాయి. ఇది చూపు కోసం మాత్రమే కాదు. దీనికి Gorilla Glass 5 రక్షణ కూడా ఉంది.

ప్రాసెసర్ & పనితీరు
MediaTek Dimensity 7300 Ultimate చిప్‌సెట్ ఆధారంగా వస్తున్న ఈ ఫోన్, Mali-G615 GPU సహాయంతో గ్రాఫిక్స్ పనుల్లో బాగా సహాయపడుతుంది. అదే కాకుండా, MediaTek HyperEngine టెక్నాలజీ వల్ల గేమింగ్ సమయంలో ల్యాగ్ ఉండదు. బ్యాటరీ తక్కువగా ఖర్చవుతుంది. అంటే గేమింగ్, మల్టీ టాస్కింగ్ అన్నింటికీ ఇది సిద్ధంగా ఉంటుంది.


స్మార్ట్ ఫీచర్లు
-ఇది Android 15 ఆధారంగా నడుస్తోంది. అందులోని XOS 15 UI కింద ఎన్నో అద్భుతమైన AI ఫీచర్లు ఉన్నాయి.
-Folax Voice Assistant – మీ పని చెప్పండి, పని అయిపోయినట్టే!
-AI వాల్‌పేపర్ జనరేటర్ – ఫోన్ లుక్స్‌ని డైనమిక్‌గా మార్చండి
-AI రైటింగ్ అసిస్టెంట్ – నోట్స్ తీసుకోవడానికి మీకు సహాయంగా ఉంటుంది
-AI నోట్ – మీ ఆలోచనలను సజావుగా నిలిపే డిజిటల్ మిత్రుడు

కెమెరా
ఈ ఫోన్‌లో 64MP Sony IMX682 ప్రైమరీ కెమెరా ఉంది. అంటే క్లారిటీ మాటల్లో చెప్పలేనంత. ఫ్రంట్ కెమెరా కూడా 13MP కావడంతో సెల్ఫీలు కూడా స్టన్నింగ్‌గా ఉంటాయి. ఇంకా 4K వీడియో రికార్డింగ్, 10x డిజిటల్ జూమ్, AI Eraser, AIGC మోడ్, డ్యూయల్ LED ఫ్లాష్ ఇవన్నీ కలిపితే, మీ ఫోటో అద్భుతంగా వస్తుంది.

బ్యాటరీ
5500mAh బ్యాటరీ, దానికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఇవి కలిస్తే, డే లాంగ్ యూజ్ గ్యారెంటీ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ వేడి కాకుండా లో టెంపరేచర్ ఛార్జింగ్, పవర్‌ను చక్కగా నిర్వహించేందుకు బైపాస్ ఛార్జింగ్, ఇంకా ఇతర ఫోన్లకు ఛార్జింగ్ ఇవ్వగలిగే రివర్స్ ఛార్జింగ్ అదరహో అనిపిస్తాయి.

Read ALso: Redmi Watch Move: వచ్చేసింది పవర్ ఫుల్ స్మార్ట్ వాచ్.. …

డిజైన్
ఈ ఫోన్ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీని కలిగి ఉంది. అంటే చిన్నపాటి జారిపోవడాలు, తడి అంటుకున్నా కూడా నష్టంగా ఉండదు. IP64 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, వెట్-సర్ఫేస్ టచ్ సపోర్ట్, అంటే చేతి తడి ఉన్నా టచ్ సరిగా పనిచేస్తుంది.

కలర్ వేరియంట్లు
-ఈ ఫోన్ మూడు స్టైలిష్ కలర్లలో వస్తుంది:
-Marine Drift Blue – వీగన్ లెదర్‌తో, కొత్తగా “సెంట్-ఇన్ఫ్యూజ్డ్ టెక్నాలజీ”తో
-Titanium Grey – ప్రొఫెషనల్‌లకు సూటెయ్యే సాఫ్ట్ లుక్
-Burgundy Red – స్టైలిష్, ట్రెండీగా ఉండే వారి కోసం

సువాసనతో ఫోన్ వాడకం?
అవును, నిజమే చదువుతున్నారు! Infinix Note 50s 5G+లో “Energizing Scent-Tech” అనే టెక్నాలజీ ఉంది. ఇది Marine Drift Blue వేరియంట్‌లో ఉపయోగిస్తే, వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ నుంచి సువాసన వస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారుడు ఫోన్ ఎలా వాడుతున్నాడనేది బట్టి సువాసన తీవ్రత, వ్యవధి మారుతుంది. ఫోన్ వాడుతూ శరీరం, మనస్సుకు శాంతి కావాలనుకుంటే ఇది అదనపు బొనస్‌ అని చెప్పవచ్చు.

ధర, లభ్యత
-ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది:
-8GB RAM + 128GB స్టోరేజ్ – రూ.15,999
-8GB RAM + 256GB స్టోరేజ్ – రూ. 17,999

ఈ ధరలు చూస్తేనే బడ్జెట్‌ను దాటకుండా బెస్ట్ ఫీచర్లు అందించేలా ప్రయత్నం చేశారు. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 24 నుంచి ప్రత్యేకంగా అమ్మకానికి వస్తుండటంతో, ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×