BigTV English
Advertisement

Pahalgam Terror Attack: నాడు ఆ స్వచ్ఛమైన నవ్వులు చూసాను.. అండగా ఉంటానంటున్న రౌడీ హీరో..?

Pahalgam Terror Attack: నాడు ఆ స్వచ్ఛమైన నవ్వులు చూసాను.. అండగా ఉంటానంటున్న రౌడీ హీరో..?

Pahalgam Terror Attack:  జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొంతమంది ఉగ్రవాదులు సైనికుల రూపంలో వచ్చి, కొండల మధ్యలో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో మినీ స్విట్జర్లాండ్ గా పేరు పొందిన ఈ ప్రాంతం మొత్తం అమాయకుల రక్తంతో మునిగిపోయింది. వేసవి సెలవులను గడపడానికి కొంతమంది ఈ ప్రాంతానికి పర్యాటనకు వెళ్లారు. మరి కొంతమంది పెళ్లి చేసుకొని సరదాగా గడపాలని నూతన వధూవరులు కూడా ఈ ప్రాంతానికి వెళ్లారు. అయితే మృత్యువు ఈ ఉగ్రవాద దాడి రూపంలో వీరిని దాడి చేసింది. మతం చూసి మరీ మగవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, అక్కడి అమాయకపు పర్యాటకుల ప్రాణాలు తీసుకున్నారు ఈ ఉగ్రవాదులు. ఇంతటి ఘోరమైన పరిస్థితిని తలుచుకుంటే హృదయం ద్రవిస్తోంది అంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.


బాధిత కుటుంబాలకు మేము అండగా నిలుస్తాం – విజయ్ దేవరకొండ

ఇప్పటికే ఈ ఘటనపై సెలబ్రిటీలు ఎంతోమంది ఒక్కొక్కరిగా తమ బాధను వ్యక్తపరుస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తుండగా.. తొలిసారి రౌడీ హీరో మేము అండగా ఉంటాము అంటూ మాట ఇచ్చి, గొప్ప మనసు చాటుకున్నారు. ఈ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు విజయ్ దేవరకొండ. ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. “రెండు సంవత్సరాల క్రితమే నా పుట్టినరోజును ఈ పహల్గామ్ లో సెలబ్రేట్ చేసుకున్నాను. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడకి వెళ్లిన నేను కాశ్మీర్లోని అందమైన ప్రాంతంలో, అక్కడి ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టిన రోజు చేసుకున్నాను. ముఖ్యంగా స్థానికంగా ఉండే కశ్మీరీ ప్రాంత స్నేహితులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే నిన్న ఆ ప్రాంతంలో జరిగింది విని నా హృదయం ముక్కలు అయింది. ఉగ్రవాదులు సైనిక రూపంలో వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు. ఇలాంటి పిరికివాళ్ళను త్వరలోనే అంత మొందిస్తారని ఆశిస్తున్నాను. భారతదేశ ఉగ్రవాదానికి ఎప్పుడు కూడా తలవంచదు. బాధిత కుటుంబాలకు మేము అండగా నిలుస్తాం ” అంటూ విజయ్ దేవరకొండ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది.


విజయ్ దేవరకొండ సినిమాలు..

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈయన ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్ డం ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు ఆయన లైన్ లో పెట్టినట్లు సమాచారం. ఇక ఒకప్పుడు అర్జున్ రెడ్డి, గీతాగోవిందం లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉండడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. మరి ఈ కింగ్డమ్ అనే సినిమాతో ఆయన సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×