BigTV English

Earthquakes in Mayanmar: మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం, 15 మంది మృతి, వందల మందికి గాయాలు

Earthquakes in Mayanmar: మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం, 15 మంది మృతి, వందల మందికి గాయాలు

మయన్మార్, బ్యాంకాక్ ను భారీ భూకంపం వణించింది. నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. మొదటి భూకంపం తీవ్రత 7.7గా నమోదు కాగా, రెండో భూకంపం 6.4గా నమోదయ్యింది. మయన్మార్ లో భూకంపత తీవ్రతకు  భారీ భవంతులు కుప్పకూలాయి. ఇప్పటి వరకు మయన్మార్ లో 15 మంది మృతి చెందారు. 43 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు ముందస్తు జాగ్రత్తగా బ్యాంకాక్‌ లో రైల్వే, మెట్రో సేవలు నిలిపివేశారు. మాండలేలో చారిత్రక అవా బ్రిడ్జి కుప్పకూలింది. థాయ్‌ లాండ్‌ లో భారీ భూకంపం ధాటికి  పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయి. ఆదేశ ప్రధాని థాయ్‌లాండ్‌ లో అత్యవసర పరిస్థితిని విధించారు.


మయన్మార్ లో భారీ భూకంపం

భూకంపం ధాటికి మయన్మార్ అతలాకుతలం అయ్యింది. మయన్మార్ లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయ్యింది. మండలే లోని ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలోకి కూలిపోయింది. భారీ భూకంపాల కారణంగా అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంప కేంద్రం సాగింగ్ సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప తీవ్రతకు బర్మాలోని భారీ భవనాలు ఊగిపోయాయి. ఆఫీసులు, ఇళ్లల్లోని జనం బయటకు పరుగులు తీశారు. బర్మాలోని ఓ షాపింగ్ మాల్ నుంచి జనాలు పరుగులు తీస్తూ కనిపించారు. మరో చోట పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కిందకు ఒలికాయి. ఆఫీసుల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


బ్యాంకాక్ లోనూ వరుస భూకంపాలు

ఈ ఎఫెక్ట్ అటు బ్యాంకాక్ పైనా పడింది.  వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. భూకంపాల ప్రభావంతో బ్యాంకాక్‌ లో దాదాపు 900 కి.మీ దూరంలో ప్రకంపనలు సంభవించాయి. థాయ్ రాజధానిలో అనేక ఎత్తైన భవనాలు నేలమయ్యం అయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎత్తైన భవనాలపైన నిర్మించిన స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు బయటకు వచ్చింది. భూకంపం కారణంగా అధికారులు అనేక భవనాలను ఖాళీ చేయించారు.

ప్రత్యక్ష సాక్షులు ఏం అంటున్నారంటే?

“నేను ఇంట్లో నిద్రిస్తున్నాను. ఆ సమయంలో భూకంపం సభవించింది. వెంటనే నేను బయటకు పరుగులు తీశాను” అని థాయిలాండ్‌ లోని చియాంగ్ మాయి ప్రాతానికి చెందిన ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. అటు భూకంపంతో పెద్ద భవనాలు, మాల్స్ తీవ్రంగా వణుకుతున్నట్లు కనించాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయంతో వీధుల్లోకి పరిగెత్తుతున్నట్లు వీడియోల్లో కనిపించింది. మరో వీడియోలో ఇన్ఫినిటీ పూల్ నుంచి నీళ్లు బయటకు పడుతున్నట్లు కనిపించింది. మరో వీడియోలో ఎత్తైన భవనం పూర్తిగా కూలిపోయినట్లు కనిపించింది. భవనం కూలడంతో ఆ ప్రాంతం అంతా దుమ్ముతో కమ్ముకుపోయింది. ఆ భవనంలో ఎంత మంది ఉన్నారు? వారి పరిస్థితి ఏంటనే విషయం తెలియరాలేదు. ఈ భూకంపం ప్రభావంతో పెద్దమొత్తంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది.

Read Also: కుప్పకూలిన విమానం.. గడ్డకట్టే చలిలో చిన్నారుల నరయాతన!

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×