Infinix QLED smart TV: ప్రస్తుత రోజుల్లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ పూర్తిగా మార్చేయడంలో స్మార్ట్ టీవీల పాత్ర చాలా కీలకం. పెద్ద పెద్ద స్క్రీన్లు, అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు ఉన్న టీవీలను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రీమియం ఫీచర్లు ఉన్న టీవీల ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్ అందించేందుకు ప్రముఖ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి అద్భుతమైన ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. అదే ‘ఇన్ఫినిక్స్ వై-సిరీస్ 102 సెంటీమీటర్ల (40 ఇంచుల) క్యూఎల్‌ఈడీ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ లినక్స్ టీవీ’. ఈ టీవీ తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉంది కాబట్టి మార్కెట్ లో దీని డిమాండ్ పెరుగుతోంది. ఇతంకీ ఈ టీవీ ఫీచర్లు, ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 13,999 మాత్రమే ఉండటం విశేషం. ఈ బడ్జెట్‌లో క్యూఎల్‌ఈడీ టెక్నాలజీతో కూడిన టీవీ లభించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. చూడడానికి అత్యంత సన్నని బెజెల్స్‌తో, మోడరన్ లుక్‌లో ఇది వస్తుంది. లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ గోడకు అమర్చుకోవడానికి అనువుగా దీంతో పాటు వాల్ మౌండ్ కూడా అందుబాటులో లభిస్తుంది. దీని క్లాసీ లుక్ మీ ఇంటర్ హోమ్ డెకర్‌కు మరింత అందాన్ని తెస్తుంది.
ఈ టీవీ మయిన్ అట్రాక్షన్ దీని డిస్‌ప్లే అనే చెప్పాలి. ఇందులో.. 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే క్యూఎల్‌ఈడీ టెక్నాలజీ వల్ల రంగులు మరింత స్పష్టంగా, కాంతివంతంగా కనిపిస్తాయి. వీడియోలు చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు లేదా గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇది అద్భుతమైన విజువల్ ఫీల్ అందిస్తుంది. డీసెంట్ బ్రైట్ నెస్, వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ దీని సొంతం.
Also Read: రూ.1000లోపు బ్లూటూత్ సౌండ్‌బార్..మ్యూజిక్ వింటే స్టెప్పులేయాల్సిందే!
కేవలం పిక్చర్ క్వాలిటీనే కాకుండా.. ఆడియో పరంగా కూడా ఈ టీవీ చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇందులో పవర్ ఫుల్ స్పీకర్లను వాడటం వల్ల క్రిస్టల్ క్లియర్ సౌండ్ లభిస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, ఇది లినక్స్ బేస్డ్ స్మార్ట్ టీవీ. దీని వల్ల వివిధ ఓటీటీ యాప్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి ఆప్షన్లు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ కారణంగా.. దీన్ని ఆపరేట్ చేయడం చిన్న పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది.
అతి తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే , స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ‘ఇన్ఫినిక్స్ వై-సిరీస్ 40 ఇంచుల స్మార్ట్ టీవీ’ ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. మీరు కూడా మీ ఇంటికి కొత్త స్మార్ట్ టీవీ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే దీనిని నిరభ్యంతరంగా కొనొచ్చు!