80స్‌లో వీధిలో అట్లాస్ సైకిల్ ఉందంటే అది పక్కా ఆఫీస్ క్లాస్ లుక్.. అదే హెరక్యులస్ ఉంటే ఊరమాస్ గ్రేస్. నల్లటి బాడీ, మెరుస్తున్న హెడ్‌లైట్, ఫ్రంట్ వీల్‌కి కనెక్ట్ చేసిన డైనమో లెట్‌లో నైట్ రైడ్ చేస్తుంటే.. కుర్రాళ్లకు వచ్చే ఆ కాన్ఫిడెన్స్ స్కై లెవల్. ప్రతీ ఇంట్లో నాన్న ఉదయాన్నే లంచ్ బాక్స్ తగిలించి ఆఫీస్‌కి వెళ్లే సరికొత్త ఫ్యామిలీ వెహికల్ ఆ సైకిలే.
స్కూల్ డేస్‌లో సీటు పైన కూర్చోవడానికి కాళ్లు అందకపోతే.. ఫ్రేమ్ ట్రయాంగిల్ మధ్యలో ఒక కాలు పెట్టి ‘క్యాడర్’ తొక్కిన మ్యాజిక్ అప్పటి కిడ్స్ ప్రతీ ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇక పండుగలు వచ్చాయంటే చాలు.. గంటకు యాభై పైసలు లేదా రూపాయి ఇచ్చి రెంట్ షాపుల్లో సైకిల్ తెచ్చుకుని, ఊరంతా షికార్లు కొడుతూ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ ఒక్క సైకిల్ సీటుపై డబుల్ సీట్, త్రిబుల్ సీటింగ్ తో ఫ్రెండ్స్ అంతా కలిసి తిరిగిన ఆ బాండింగే ఒక గోల్డెన్ మెమరీ!
టైర్‌లో గాలి తగ్గితే సీటు కింద ఉండే చిన్న సంచిలోంచి పంపర్ తీసి గాలి కొట్టడం.. ఊడిపోయిన చైన్‌కి గ్రీస్ పూసి చేతులు నల్లగా చేసుకోవడం వెరీ కామన్ గా జరిగేది. వాల్వ్ ట్యూబ్ మార్చడం, ఊరి చివర పంచర్ షాప్‌కి సైకిల్ నెట్టుకుంటూ వెళ్లడం, సాయంత్రం వేళ బట్టతో సైకిల్ ప్యానెల్‌ని మెరిపించడం ప్రతీ రైడర్‌కి ఒక ఎమోషనల్ మెయింటెనెన్స్.
ఇక కుర్రాళ్లయితే.. (ఈ రోజుల్లో నిబ్బాలు) కాలేజీకి వెళ్లే అమ్మాయిల ముందు ఈ సైకళ్లతోనే కటింగులు కొట్టేవారు. నిబ్బీలు.. అదేనండి అమ్మాయిలు కూడా.. ఆ స్టైలిష్ సైకిల్ విన్యాసాలకు పడిపోయేవారు. అయితే, ఇప్పటి నిబ్బానిబ్బీలతో పోల్చితే.. అప్పుటి కుర్రాకారు చాలా బెటర్ అనుకోండి.
Also Read: అమ్మ చేతి కమ్మని వంట.. కిచెన్ నుంచి వచ్చే ఆ మసాలాల సువాసనలు, ఇప్పుడేవీ?
రోజులు మారాయి.. అట్లాస్, హెరక్యులస్ సైకిళ్ల ప్లేస్‌ని మోడర్న్ గేర్ బైసికల్స్, కార్బన్ ఫ్రేమ్‌లు, డిజిటల్ స్పీడోమీటర్లు ఆక్యుపై చేసేశాయి. ఈరోజు ఫిట్‌నెస్ కోసం వేలకు వేలు పెట్టి రైడింగ్స్ చేస్తున్నాం కానీ.. ఆ బారీ సైకిల్ క్యారియర్ మీద పక్కింటి దోస్తుని కూర్చోబెట్టుకుని, ఈల వేస్తూ తొక్కిన ఆ ఆనందం మాత్రం లేదు.
Also Read: ఒక్క ఫోటో కోసం ఎన్నో రోజులు ఎదురుచూపులు.. 80s స్టూడియో అనుభూతే వేరు!